News June 20, 2024
అవసరమైతే NTAపైనా చర్యలు: కేంద్ర మంత్రి

NEET నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఈ విషయంలో లోతైన విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నీట్ అవకతవకలపై బిహార్ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. పారదర్శక పరీక్షల నిర్వహణే తమ లక్ష్యమని, విద్యార్థుల ప్రయోజనం విషయంలో రాజీపడబోమన్నారు. అందుకోసం బాధ్యులైన NTA అధికారులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Similar News
News November 22, 2025
వనజీవి జీవితంపై సినిమా మొదలు!

తెలంగాణ ‘వనజీవి’గా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య జీవిత చరిత్ర సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఖమ్మంలో ఈ బయోపిక్ను లాంఛనంగా ప్రారంభించారు. వనజీవి రామయ్య తన జీవితాన్ని లక్షలాది మొక్కలను నాటడానికి, రక్షించడానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదర్శవంతమైన, నిరాడంబర జీవన విధానం, పర్యావరణ భక్తిని ఈ సినిమా వెండితెరపైకి తీసుకురానుంది. ఆయన పాత్రలో నటుడు బ్రహ్మాజీ కనిపించనున్నారు.
News November 22, 2025
క్షమాపణలు చెప్పిన అల్-ఫలాహ్ వర్సిటీ

ఢిల్లీ పేలుడు ఘటనలో అల్-ఫలాహ్ వర్సిటీ పేరు రావడంతో, వారి వెబ్సైట్లో ఉన్న పాత అక్రిడిటేషన్ వివరాలపై NAAC షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వర్సిటీ స్పందిస్తూ వెబ్సైట్ డిజైన్ లోపాలు కారణంగా ఈ పొరపాట్లు జరిగాయని క్షమాపణలు తెలిపింది. తప్పుడు సమాచారాన్ని తొలగించినట్లు పేర్కొంది. కాగా గడువు ముగిసిన తరువాత కూడా వర్సిటీ గ్రేడ్లను తమ సైట్లో కొనసాగిస్తూ వచ్చింది.
News November 22, 2025
జల, వాయు మార్గాల ద్వారా భారత్-అఫ్గాన్ ట్రేడ్

భారత్-అఫ్గాన్ మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. పాక్ రోడ్డు మార్గం మూసేయడంతో జల, వాయు మార్గాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఇరాన్లోని చాబహార్ ఓడరేవుతోపాటు రెండు ప్రత్యేక కార్గో విమానాలను ఉపయోగించుకోనున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం IND-AFG మధ్య బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుండగా, భవిష్యత్తులో మరింత పెంచనున్నాయి.


