News March 8, 2025
నటుడు మృతి.. కారణం ఇదే

హాలీవుడ్ నటుడు హాక్‌మన్, అతని భార్య అమెరికాలోని ఇంట్లో అనుమానాస్పద స్థితిలో <<15598233>>చనిపోయిన <<>>సంగతి తెలిసిందే. వారి మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో అతడు గుండె జబ్బు, అల్జీమర్స్‌తో చనిపోయినట్లు తేలింది. అతని భార్య హాంటావైరస్ ఇన్‌ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని మరణించిందని గుర్తించారు. అటు భార్య అనారోగ్యంతో వారం క్రితం మృతి చెందిన విషయం హాక్‌మన్‌కు తెలియదని సమాచారం.
Similar News
News April 18, 2026
రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.
News April 18, 2026
హార్ముజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్

హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ షాకిచ్చింది. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను US అడ్డుకోవడంపై మండిపడింది. ఇది ఆగేవరకు తమ నియంత్రణ కొనసాగుతుందని మిలిటరీ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా తన హామీలను విస్మరించిందని ఫైరయ్యింది.
News April 18, 2026
GOOD NEWS: చిన్నారి పునర్వికకు పునర్జన్మ

స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాలు నిలిచాయి. <<19232308>>దాతల<<>> ద్వారా సేకరించిన ₹10కోట్లు, ప్రభుత్వం తరఫున మరో ₹6కోట్లు వెచ్చించి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ను ఇవాళ అందించారు. ‘ఇచ్చిన <<19240414>>మాట<<>> నిలబెట్టుకున్నాం. చిట్టి తల్లి నూరేళ్లు వర్ధిల్లు’ అని పునర్వికతో ఉన్న ఫొటోలను మంత్రి లోకేశ్ షేర్ చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మానవత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


