News December 5, 2024

డ్రగ్స్ కేసులో నటుడి కొడుకు అరెస్ట్.. వెలుగులోకి కీలక విషయాలు

image

డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో తమిళనాడులో అరెస్టైన ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ కుమారుడు అలీ ఖాన్ తుగ్లక్ వ్యవహారంలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. అతడు డ్రగ్స్ వాడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. చెన్నైలోని పలు కాలేజీల విద్యార్థులకు డ్రగ్స్ విక్రయించే ఓ డీలర్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబత్తూరు కోర్టు అలీ ఖాన్ సహా ఏడుగురికి 15 రోజుల రిమాండ్ విధించింది.

Similar News

News January 23, 2026

కోడి పిల్లలను వదిలాక షెడ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కోళ్ల షెడ్‌లో ప్రతి 50 కోడి పిల్లలకు ఒక మేత తొట్టి, నీటి తొట్టి అమర్చాలి. తొలి వారంలో 50 పిల్లలకు 24 అంగుళాల మేత తొట్టి సరిపోతుంది. ప్రతి బ్రూడరు కింద 3-4 నీటి తొట్లను అమర్చాలి. వాటిని రోజూ శుభ్రపరచి నీటితో నింపాలి. కోడి పిల్లలను ఉంచిన షెడ్‌లో రాత్రంతా లైట్లను ఆన్‌లో ఉంచాలి. కోడి పిల్లలకు తొలి 7-10 రోజుల మధ్య ముక్కును కత్తిరిస్తే అవి ఒకదానినొకటి పొడుచుకోవడం, తొట్లలో మేతను కిందకు తోయడం తగ్గుతుంది.

News January 23, 2026

రాత్రిపూట ఎంగిలి పాత్రలను అలాగే వదిలేస్తున్నారా?

image

రాత్రి భోజనం తర్వాత అంట్లు తోమకుండా వంటగదిలో అలాగే వదిలేయడం వాస్తు రీత్యా చాలా అశుభం. ఉదయం లేవగానే మురికి పాత్రలను చూడటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. తద్వారా దరిద్రం, పేదరికం రావొచ్చని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. ఎంగిలి పాత్రల వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదు. అందుకే వీలైనంత వరకు రాత్రే వంటగదిని, పాత్రలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత, సంపద పెరుగుతాయి.

News January 23, 2026

ఖలిస్థానీల దుశ్చర్య.. త్రివర్ణ పతాకం తొలగింపు

image

క్రొయేషియాలో భారత రాయబార కార్యాలయంలోకి ఖలిస్థానీ మూకలు చొరబడ్డాయి. జాగ్రెబ్‌లోని ఎంబసీపై ఉన్న భారత త్రివర్ణ పతాకాన్ని తొలగించాయి. ఆ స్థానంలో ఖలిస్థానీ జెండాను ఎగురవేశాయి. ఈ దుశ్చర్యను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది.