News March 9, 2025
పెళ్లి పీటలెక్కబోతున్న నటి అభినయ

సినీ నటి అభినయ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. కాబోయే భర్తతో గుడి గంట కొడుతున్న ఫొటోను షేర్ చేశారు. అతని ముఖాన్ని మాత్రం చూపించలేదు. ‘చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. మాది 15 ఏళ్ల బంధం’ అని ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దివ్యాంగురాలైన (మూగ, చెవిటి) అభినయ తెలుగులో శంభో శివ శంభో, ఢమరుకం, దమ్ము, SVSC వంటి సినిమాలతో పాపులరైన సంగతి తెలిసిందే.
Similar News
News March 5, 2026
బెంగాల్ గవర్నర్ రాజీనామా.. మమత ఏమన్నారంటే?

బెంగాల్ గవర్నర్ పదవికి ఆనంద్ బోస్ రాజీనామా చేయడం షాక్‌కు గురి చేసిందని సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ‘ఆయన రిజైన్ వెనుక కారణం తెలియదు. కానీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి చేసి ఉంటారు. ఎన్.రవిని WB గవర్నర్‌గా నియమిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ విషయంలో నాతో చర్చించలేదు. ఇలాంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తాయి’ అని ట్వీట్ చేశారు.
News March 5, 2026
కడియంపై తీర్పు రిజర్వు చేసిన స్పీకర్

TG: MLAలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇవాళ విచారణ కొనసాగించారు. శ్రీహరికి సంబంధించి ఇరువర్గాల వాదనలు విన్న స్పీకర్ తీర్పును రిజర్వు చేశారు. కాగా BRS పిటిషన్‌పై సమాధానమిచ్చేందుకు కొంత సమయం కావాలని దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు స్పీకర్‌ను కోరారు. మరోపక్క SC సూచనలతో కౌశిక్ రెడ్డి న్యాయవాదులు రాత పూర్వక వివరణను స్పీకర్‌కు అందించారు.
News March 5, 2026
ఫోన్‌పే ‘ముద్ర’.. ఫ్యూచర్‌లో UPI పేమెంట్లన్నీ అలానే?

UPI పేమెంట్ల కోసం <<19190765>>బయోమెట్రిక్ వ్యవస్థ<<>>ను తీసుకొచ్చి ఫోన్‌పే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దశాబ్దకాలంగా కేవలం పిన్ ద్వారానే పేమెంట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫోన్‌పే తెచ్చిన ఫింగర్ ప్రింట్/ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్ భవిష్యత్ UPI చెల్లింపుల్లో కీలకం కానుంది. పిన్ మరిచిపోయినా ఇబ్బంది లేకపోవడం, సింగిల్ టచ్ పేమెంట్, ఫాస్ట్, సేఫ్ ప్రాసెస్ కావడంతో మిగతా కంపెనీలూ దీన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది.


