News June 10, 2024
నటి మృతి.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రాని తల్లిదండ్రులు

బాలీవుడ్ నటి నూర్ మాలాబికా దాస్ ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు రాలేదు. వారిది అస్సాం కాగా ఇటీవల నూర్‌ను చూసేందుకు ముంబై వచ్చి తిరిగి వెళ్లారట. వృద్ధాప్య దశలో ఉన్న తాము మృతదేహం కోసం మళ్లీ రాలేమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నూర్ స్నేహితుడు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో అంత్యక్రియలు జరిపించారు.
Similar News
News March 25, 2025
ఆస్తి పన్ను వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ

AP: ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరు వరకు ప్రాపర్టీ ట్యాక్స్‌పై పెండింగ్‌లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ జీవో జారీ చేసింది. ప్రజల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల కొన్నేళ్లుగా పేరుకుపోయిన రూ.కోట్ల బకాయిలు వసూలవుతాయని అధికారులు చెబుతున్నారు.
News March 25, 2025
ఒళ్లంతా జ్వరం పట్టినట్టు ఉంటోందా…

వారం రోజులుగా చాలామంది శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. తల తిరగడం, శరీరం తూలడం, కాళ్లు చేతులు లాగడం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధ పడుతున్నారు. ఒళ్లంతా జ్వరం పట్టినట్టే ఉంటోందని వాపోతున్నారు. వాతావరణం మారడం, ఎండలు పెరగడమే దీనికి కారణమని వైద్యనిపుణులు చెప్తున్నారు. డీహైడ్రేషన్‌కు గురవ్వకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అవసరమైతే డాక్టర్ వద్దకు వెళ్లాలని చెప్తున్నారు. మీకూ ఇలాగే ఉంటోందా?
News March 25, 2025
మరో చోటుకు తిహార్ జైలు తరలింపు

ఆసియాలోనే అతిపెద్దదైన తిహార్ జైలును ఢిల్లీ సరిహద్దుల్లోకి మార్చనున్నట్లు ఢిల్లీ CM రేఖా గుప్తా ప్రకటించారు. కొత్త జైలు నిర్మాణం కోసం సర్వే, కన్సల్టెన్సీ సర్వీసుల ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరు చేశారు. 400 ఎకరాల విస్తీర్ణంలో తిహార్ జైలును 1958లో నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ 13వేల మంది ఖైదీలు ఉన్నట్లు అంచనా. తొలుత ఇది పంజాబ్ అధీనంలో ఉండగా 1966లో ఢిల్లీ ప్రభుత్వం టేకోవర్ చేసింది.