News December 1, 2024

హైదరాబాద్‌లో నటి ఆత్మహత్య

image

కన్నడ పాపులర్ సీరియల్ నటి శోభితా శివన్న(32) హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ప్రస్తుతం హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలోని సక్లేశ్‌పూర్‌కు చెందిన శోభిత ‘బ్రహ్మగంటు’ సహా పలు సీరియళ్లతో మంచి గుర్తింపు పొందారు. 2023 వివాహం అనంతరం నటనకు విరామం ఇచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 6, 2025

గిగ్ వర్కర్ల సంక్షేమానికి TG ప్రత్యేక చట్టం

image

TG: రాష్ట్ర గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ బిల్-2025ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ బిల్లును త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో ఆమోదిస్తారు. అనంతరం రానున్న అసెంబ్లీ సమావేశంలో ఆమోదించి ప్రత్యేక చట్టం చేయనున్నారు. ఈ చట్టం గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత అందిస్తుంది. ప్రధానంగా ఆదాయ భద్రత, కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు, గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు.

News November 6, 2025

నియోనాటల్‌ పీరియడ్‌ కీలకం

image

బిడ్డ పుట్టిన మొదటి 28 రోజులు చాలా క్లిష్టమైన సమయం. దీన్ని నియోనాటల్‌ పీరియడ్‌ అంటారు. ఈ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా శిశువు ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు. నియోనాటల్‌ పీరియడ్‌‌లో బిడ్డకు అనారోగ్యాల ముప్పు తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహించడానికి స్పెషల్‌ కేర్‌ అవసరం. బిడ్డను వెచ్చగా ఉంచడం, శ్వాసక్రియ సరిగా ఉండేలా చూడటం, తల్లిపాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటం ముఖ్యమని చెబుతున్నారు.

News November 6, 2025

కష్టాల్లో ఆస్ట్రేలియా

image

భారత్‌తో నాలుగో టీ20లో 168 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మార్ష్ 30, షార్ట్ 25, ఇంగ్లిస్ 12, డేవిడ్ 14, ఫిలిప్పీ 10 రన్స్‌కే ఔట్ అయ్యారు. భారత బౌలర్లు అక్షర్, దూబే చెరో 2 వికెట్లతో అదరగొట్టారు. అర్ష్‌దీప్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం ఆసీస్ విజయానికి 36 బంతుల్లో 69 రన్స్ అవసరం.