News December 1, 2024
హైదరాబాద్‌లో నటి ఆత్మహత్య

కన్నడ పాపులర్ సీరియల్ నటి శోభితా శివన్న(32) హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ప్రస్తుతం హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలోని సక్లేశ్‌పూర్‌కు చెందిన శోభిత ‘బ్రహ్మగంటు’ సహా పలు సీరియళ్లతో మంచి గుర్తింపు పొందారు. 2023 వివాహం అనంతరం నటనకు విరామం ఇచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 16, 2026
జగన్.. ఇదేం రాక్షస మనస్తత్వం: లోకేశ్

AP: YCP చీఫ్ జగన్‌పై మంత్రి లోకేశ్ X వేదికగా విరుచుకుపడ్డారు. ‘తల్లిని, చెల్లిని తరిమేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రప్పా.. రప్పా నరుకుతాం. అమరావతిని మార్చేస్తాం. కట్టినవన్నీ కూల్చేస్తాం అంటారు. ఎందుకీ దుర్మార్గం? అధునాతన బోట్ల తయారీ కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి తరిమేస్తానంటారా. ఇదేం రాక్షసమనస్తత్వం? వెయ్యికిపైగా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకోవడం సైకోయిజమే’ అని దుయ్యబట్టారు.
News April 16, 2026
చడ్ఢాకు ‘Z’ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం

ఆప్ ఎంపీ రాఘవ్ చడ్ఢాకు కేంద్రం ‘Z’ కేటగిరీ భద్రతను కల్పించింది. పంజాబ్ ఎంపీగా ఉన్న ఆయనకు ప్రాణాపాయ ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు ధ్రువీకరించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ ప్రభుత్వం ఆయనకు ఉన్న Z+ భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే కేంద్రం రంగంలోకి దిగడం గమనార్హం. తాజా ఉత్తర్వుల ప్రకారం చడ్ఢాకు ఇకపై 22 మంది CRPF కమాండోలతో కట్టుదిట్టమైన రక్షణ ఉండనుంది.
News April 16, 2026
కరుడుగట్టిన పాక్ ఉగ్రవాది హమ్జాపై కాల్పులు!

పాక్‌లోని లాహోర్‌లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు, కరుడుగట్టిన ఉగ్రవాది అమీర్ హమ్జా తీవ్రంగా గాయపడ్డాడు. ఓ న్యూస్ ఛానల్ ఆఫీస్ బయట ఈ అటాక్ జరిగినట్లు సమాచారం. హమ్జాను వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హఫీజ్ సయీద్‌తో కలిసి లష్కరేను స్థాపించిన హమ్జా.. భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్నాడు.


