News October 14, 2024

నటి కారుకు యాక్సిడెంట్‌.. తీవ్ర గాయాలు

image

బుల్లితెర నటి శ్రీవాణి ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె నుదుటి మీద తీవ్ర గాయం కావడంతో పాటు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. ప్రస్తుతం గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె భర్త విక్రమాదిత్య వెల్లడించారు. 3రోజుల క్రితం కుటుంబంతో కలిసి చీరాల బీచ్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. శ్రీవాణి పలు సీరియల్స్‌, టీవీ షోల్లోనూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటారు.

Similar News

News November 10, 2024

రాష్ట్రంలో 243 కులాలు: ప్రభుత్వం

image

TG: రాష్ట్రంలో మొత్తం 243 రకాల కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీల్లో 134, ఎస్సీల్లో 59, ఎస్టీల్లో 32, ఓసీల్లో 18 సామాజిక వర్గాలున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన నేపథ్యంలో కులాలకు కోడ్‌లను కేటాయించింది. కులం, మతం లేదన్న వారికీ ఓ కోడ్‌ను కేటాయించింది. ఇతర రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా కోడ్‌లతో డేటా సేకరిస్తోంది. భూసమస్యలపైనా ప్రజల నుంచి వివరాలు సేకరిస్తోంది.

News November 10, 2024

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

AP: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం సమావేశాల తొలిరోజే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకంటే ముందు సీఎం కార్యాలయంలో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ వెంటనే సభను స్పీకర్ వాయిదా వేస్తారు. ఈ సమావేశాలు 11న ప్రారంభమై 11రోజులు కొనసాగే అవకాశం ఉంది.

News November 10, 2024

నేడు సౌతాఫ్రికాతో భారత్ రెండో టీ20

image

భారత్, సౌతాఫ్రికా మధ్య 4 టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఈరోజు జరగనుంది. సెయింట్ పార్క్ వేదికగా రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానుంది. కాగా తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా 61రన్స్ తేడాతో సఫారీ జట్టును మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 2-0తో సిరీస్‌పై పట్టుబిగించాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది. అటు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్‌ బరిలో నిలవాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది.