News December 3, 2024

బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడిని సజీవ దహనం చేసిన నటి చెల్లి

image

రాక్‌స్టార్ మూవీ నటి నర్గీస్ ఫక్రీ సిస్టర్ ఆలియా ఫక్రీ (43)ని న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ప్రియుడు జాకబ్ (35), అతడి ఫ్రెండ్ ఎటినీ (33) ఉంటున్న గ్యారేజ్‌ను NOV 2న ఆమె తగలబెట్టారు. ఈ ప్రమాదంలో వారిద్దరూ మరణించారు. ఏడాది క్రితం అతడు బ్రేకప్ చెప్పినా ఆమె అంగీకరించలేదని తెలిసింది. ఆ కోపంతో రగిలిపోతున్న ఆలియా ‘మీరు ఈ రోజు నా చేతుల్లో చచ్చారు’ అని అరుస్తూ నిప్పంటించినట్టు సాక్షులు తెలిపారు.

Similar News

News February 18, 2026

నేరేడు పూత, పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

నేరేడు చెట్లకు ఫిబ్రవరి ఆఖరు నుంచి లేదా మార్చి తొలి వారంలో నీటి వసతిని ఏర్పాటు చేసుకుంటే పూత రాలకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ వచ్చిన పూత రాలుతున్నట్లు గమనిస్తే 15 లీటర్ల నీటిలో ప్లానోఫిక్స్ అనే మందు 3 గ్రాములను కలుపుకొని ఒకసారి పిచికారీ చేయాలి. దీని వల్ల పూత రాలడం తగ్గి, పిందె కట్టడానికి, పిందె శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాయ నాణ్యత పెంచడానికి కూడా ఈ మందు కొంత సాయం చేస్తుంది.

News February 18, 2026

కలియుగ వైకుంఠవాసా.. నువ్వు లేవని ఎవరన్నారయ్యా!

image

స్వామీ! నువ్వు లేవని ఎవరైనా అనగలరా? నీ ఏడుకొండల గాలి, నీ గోవింద నామం.. నాస్తికుడిని సైతం ఆస్తికుడిగా మార్చగలవు. నీ దివ్య మంగళ రూపం రాయిలాంటి హృదయాన్ని కూడా ముగ్థులను చేయగలదు. నిన్ను చూడాలని వచ్చిన ఎవ్వరినైనా నీ కరుణా సముద్రంలో మునిగేలా చేస్తావు. నీ దివ్య సౌందర్యానికి దాసోహం చేసుకుంటావు. ఆనంద నిలయంలో కొలువైన నిన్ను చూశాక భక్తుల కళ్లలో వెలిగే ఆనంద బాష్పాలే నీ ఉనికికి సాక్ష్యాలు.

News February 18, 2026

805 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC)లో 805 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో HYDలో 105 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి 60%మార్కులతో BE/BTech, ME/MTech, PG(సైన్స్), MCA, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdac.in