News September 19, 2024
వరద బాధితులకు అదానీ రూ.25 కోట్ల విరాళం
AP: విజయవాడ వరద బాధితులకు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రూ.25 కోట్ల భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆ సంస్థ ప్రతినిధి సీఎం చంద్రబాబుకు అందజేశారు. ‘ఏపీలో వరదల కారణంగా అపార నష్టం సంభవించడం బాధాకరం. అదానీ గ్రూప్ తరఫున రాష్ట్ర ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నాం’ అని అదానీ ట్వీట్ చేశారు.
Similar News
News October 3, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలో రేపు ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడులో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
News October 3, 2024
11న మద్యం షాపుల కేటాయింపు: ఎక్సైజ్ శాఖ
AP: రాష్ట్రంలో లాబీయింగ్‌కు తావు లేకుండా మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 11న లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని, 12 నుంచి మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బార్‌ల లైసెన్స్ 2025 ఆగస్టు వరకు ఉండటంతో వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
News October 3, 2024
నాలుగు భాషల్లో ప్రసంగించిన పవన్
AP: ‘వారాహి’ డిక్లరేషన్ కార్యక్రమంలో నాలుగు భాషల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగింది. జాతీయ మీడియాకు అర్థమవ్వాలంటూ ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఆయన ప్రసంగించారు. దీంతో పాటు తమిళంలోనూ ఆయన మాట్లాడారు. ఇక తెలుగులోనూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో పవన్‌కు బహు భాషల్లో ప్రావీణ్యం ఉందని ఆయన ఫాలోవర్స్ పోస్టులు చేస్తున్నారు.