News November 24, 2024
మోదీకి అదానీ, జగన్ అనుకూలం: నారాయణ
AP: ముడుపుల వ్యవహారంలో అదానీపై అమెరికాలో కేసు నమోదైనందున ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి అదానీ, మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. రూ.1,750 కోట్ల ముడుపులు ఇచ్చి రూ.లక్ష కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని విమర్శించారు. దీనిపై దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరారు.
Similar News
News November 24, 2024
చిన్న డెస్క్‌లో పనిచేయిస్తున్నారంటూ రూ.38 కోట్ల దావా
తన ఎత్తు, బరువుకు సరిపోని డెస్క్‌లో బలవంతంగా పనిచేయిస్తున్నారంటూ న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ ఉద్యోగి విలియం మార్టిన్ కోర్టులో రూ.38 కోట్లకు దావా వేశారు. ‘నా ఎత్తు 6.2 అడుగులు. బరువు 163 కేజీలు. నా డెస్క్ చాలా చిన్నగా ఉంది. దీనివల్ల నాకు శారీరక, మానసిక సమస్యలు తలెత్తాయి’ అని పేర్కొన్నారు. అయితే అతను ఆఫీసులో నిద్రపోతుండటంతో సస్పెండ్ చేశామని, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కంపెనీ తెలిపింది.
News November 24, 2024
కేఎల్ రాహుల్‌కు రూ.14 కోట్లు
స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన ఇతడిని రూ.14కోట్లకు కొనుగోలు చేసింది. రాహుల్ కోసం ఢిల్లీ, CSK పోటీ పడ్డాయి. ఐపీఎల్ కెరీర్లో రాహుల్‌కు 4683 రన్స్ ఉన్నాయి. గత సీజన్లో లక్నో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.
News November 24, 2024
ఆ పని నేను చేయను: DY చంద్రచూడ్
65 ఏళ్ల వయసులో తన పని పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల అనుమానాల్ని కలిగించే ఏ పని చేయబోనని Ex CJI DY చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. NDTV సదస్సులో రాజకీయాల్లో చేరికపై ప్రశ్నించగా చంద్రచూడ్ ఈ విధంగా స్పందించారు. న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసినా, సమాజం వారిని న్యాయమూర్తిగానే చూస్తుందన్నారు. ఇతరులను అంగీకరించినట్టు(రాజకీయాల్లో చేరడం), జడ్జిల చేరికను సమాజం అంగీకరించబోదన్నారు.