News June 2, 2024

మళ్లీ అదానీనే నెం.1!

image

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన నికర సంపద $111 బిలియన్లకు పెరిగింది. ఫలితంగా అంబానీని ($109 బిలియన్లు) వెనక్కి నెట్టి బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానానికి చేరారు. శుక్రవారం జరిగిన ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ స్టాక్స్ దూసుకెళ్లడమే ఇందుకు కారణం. కాగా గత ఏడాది హిండెన్‌బర్గ్ రిపోర్ట్ కారణంగా అదానీ సంపద క్షీణించిన సంగతి తెలిసిందే.

Similar News

News October 12, 2024

అధికారిపై పవన్ కళ్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశం

image

AP: కాకినాడ DFO డి.రవీంద్రనాథ్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. ఇటీవల బదిలీపై కాకినాడకు వచ్చిన ఆయన పవన్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయంటూ మైనింగ్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. తన పేరు, పేషీ పేరు వాడటంపై ఆగ్రహించిన పవన్, విచారించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటు తన పేరుతో అవినీతికి పాల్పడితే చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.

News October 12, 2024

నేటి నుంచి పాపికొండలు టూర్ స్టార్ట్

image

దసరా సందర్భంగా పర్యాటకులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి పాపికొండల్లో లాంచీల్లో విహరించేందుకు అధికారులు అనుమతిచ్చారు. వరదల కారణంగా ఐదు నెలల పాటు పాపికొండలు టూరిజంను నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితులు మెరుగవ్వడంతో లాంచీ యజమానుల విజ్ఞప్తుల మేరకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు.

News October 12, 2024

నవంబర్ 8 నుంచి DAO సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(DAO) ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు TGPSC కీలక అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో సెలక్ట్ చేశారు.