News June 2, 2024
మళ్లీ అదానీనే నెం.1!
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన నికర సంపద $111 బిలియన్లకు పెరిగింది. ఫలితంగా అంబానీని ($109 బిలియన్లు) వెనక్కి నెట్టి బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానానికి చేరారు. శుక్రవారం జరిగిన ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ స్టాక్స్ దూసుకెళ్లడమే ఇందుకు కారణం. కాగా గత ఏడాది హిండెన్‌బర్గ్ రిపోర్ట్ కారణంగా అదానీ సంపద క్షీణించిన సంగతి తెలిసిందే.
Similar News
News September 19, 2024
అక్టోబర్ 3 నుంచి దసరా నవరాత్రులు
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే అవకాశం ఉండటంతో వారికి తాగునీరు, పాలు, అల్పాహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
News September 19, 2024
జానీ మాస్టర్‌ది లవ్ జిహాదీనే: కరాటే కళ్యాణి
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై సినీ నటి కరాటే కళ్యాణి మండిపడ్డారు. ‘జానీ మాస్టర్‌ది కచ్చితంగా లవ్ జిహాదీ కేసే. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలి. నిందితుడిగా తేలితే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మతం మారితే పెళ్లి చేసుకుంటాననడం ఏమిటి? బాధితురాలికి అందరూ అండగా నిలవాలి’ అని ఆమె పేర్కొన్నారు.
News September 19, 2024
ఒకప్పుడు టమాటాను విషం అనుకునేవారు!
పలు పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు టమాటాను విషంగా భావించి భయపడేవారు. అవి తినడం వల్ల చాలామంది కన్నుమూయడమే అందుక్కారణం. మరణ భయంతో దానికి పాయిజన్ యాపిల్ అని పేరు కూడా పెట్టారు. సుమారు 200 ఏళ్ల పాటు ఈ నమ్మకమే ఉండేది. అయితే, ప్రజలు వాడుతున్న ప్యూటర్(pewter) ప్లేట్లలో లెడ్ సారం ప్రమాదకర స్థాయుల్లో ఉంటోందని, టమాటాల్లోని ఆమ్లంతో కలిసి వారి మరణాలకు దారి తీస్తోందని తర్వాత గుర్తించారు.