News November 3, 2024
బంగ్లాదేశ్‌కు అదానీ ‘పవర్ వార్నింగ్’
బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి అదానీ పవర్ అల్టిమేటం జారీ చేసింది. నవంబర్ 7లోపు రూ.7,200 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే విద్యుత్ సరఫరాను సగానికి తగ్గించడంతో బంగ్లాదేశ్‌లో 1,600 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడినట్టు స్థానిక మీడియా తెలిపింది. బకాయిలు చెల్లించకపోతే ఒప్పందం మేరకు సరఫరా నిలిపివేస్తామని అదానీ పవర్ స్పష్టం చేసింది.
Similar News
News December 8, 2024
PM కిసాన్ రూ.12వేలకు పెంచాలని డిమాండ్
వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను ఒక శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. PM కిసాన్ వార్షిక సాయాన్ని ₹6K నుంచి ₹12Kకు పెంచాలని కోరారు. PM ఫసల్ బీమా యోజన కింద సన్నకారు రైతులకు జీరో ప్రీమియంతో ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రీబడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో విన్నవించారు. పురుగుమందులపై GSTని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని PHD ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతిపాదించింది.
News December 8, 2024
OTTలోకి వచ్చేసిన ‘కంగువా’
శివ డైరెక్షన్‌లో సూర్య నటించిన కంగువా మూవీ OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 14న విడుదలైంది. సూర్య నటనకు ప్రశంసలు దక్కినా సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. బాబీ డియోల్, దిశా పటానీ, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు.
News December 8, 2024
హెడ్ విషయంలో సిరాజ్ విలన్ అయ్యారు: గవాస్కర్
ట్రావిస్ హెడ్ ఔట్ అయిన అనంతరం భారత బౌలర్ సిరాజ్‌కు, ఆయనకు మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అది పూర్తిగా అనవసరమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. ‘హెడ్ ఒకట్రెండు పరుగులు కాదు.. 140 రన్స్ చేశారు. ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అలాంటి ఆటగాడిని ఔట్ చేయడం ద్వారా హీరో అవ్వాల్సిన సిరాజ్, తన చర్యతో విలన్ అయ్యారు. హెడ్‌ను అభినందించి ఉంటే ప్రేక్షకుల అభిమానం పొంది ఉండేవారు’ అని పేర్కొన్నారు.