News February 13, 2025

శ్రీలంక విద్యుత్ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్న అదానీ

image

శ్రీలంకలో తాము నిర్మించాల్సిన రెండు పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి తప్పుకొంటున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది. ఆ దేశంలో ఏర్పడిన కొత్త సర్కారు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని యోచిస్తోంది. అది తమకు అంతగా లాభించదన్న ఆలోచనతోనే అదానీ సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు విలువ బిలియన్ డాలర్ల వరకూ ఉండటం గమనార్హం.

Similar News

News March 18, 2025

భారీ లాభాల్లో మార్కెట్లు

image

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 736 పాయింట్ల లాభంతో 75,047 వద్ద ట్రేడ్ అవుతుంటే, నిఫ్టీ 255 పాయింట్ల లాభంతో 22,764 వద్ద కదలాడుతోంది. జొమాటో, ఐసీఐసీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, HUL, L&T షేర్లు లాభాల్లో ఉన్నాయి.

News March 18, 2025

9 నెలలు అంతరిక్షంలోనే ఎందుకున్నారంటే?

image

గత ఏడాది జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, విల్మోర్ దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉన్నారు. 8 రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉండగా వీళ్లను తీసుకెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్‌లో సమస్యలు తలెత్తాయి. ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు, థ్రస్టర్స్ మూసుకుపోవడంతోపాటు హీలియం కూడా అయిపోయింది. దీంతో SEP 7న వ్యోమగాములు లేకుండానే స్టార్ లైనర్ భూమికి తిరిగి రాగా వారు అక్కడే ఉండిపోయారు.

News March 18, 2025

అందుకే 24ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నా: పార్తీబన్

image

నటి సీతతో విడాకుల తర్వాత ఇప్పటివరకూ పెళ్లి చేసుకోలేదని నటుడు R.పార్తీబన్ అన్నారు. భార్యగా వేరొకరికి స్థానం ఇవ్వలేనని, అందుకే ఒంటరిగా ఉంటున్నానని ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. సీతతో ఇప్పుడు టచ్‌లో లేనని, ఆమె తల్లి చనిపోయినప్పుడు మాత్రం అంత్యక్రియలు జరిపానని అన్నారు. 1990లో వీరు వివాహం చేసుకోగా 2001లో విడాకులు తీసుకున్నారు. సీత 2010లో మరో పెళ్లి చేసుకుని 2016లో విడిపోయారు.

error: Content is protected !!