News November 21, 2024
అదానీ స్కాం: ఏపీ ప్రభుత్వానికి రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అభియోగాలు!
AP: అదానీపై అమెరికా మోపిన అభియోగాల్లో గత ప్రభుత్వం పేరు కూడా ఉంది. ఆనాటి ఏపీ ప్రభుత్వానికి రూ.1,750 కోట్ల లంచం ఇచ్చి సౌర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 2021లో అదానీ అప్పటి సీఎం జగన్ను కలిసిన తర్వాత ‘సెకీ’ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. అదానీ పవర్ నుంచి కొన్న విద్యుత్ ఏపీకి ఇవ్వాలని ‘సెకీ’ నిర్ణయించినట్లు వివరించారు.
Similar News
News November 21, 2024
రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో పోరాటం: వైసీపీ ఎంపీలు
AP: వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తామని YCP MPలు తెలిపారు. వైసీపీ చీఫ్ జగన్తో భేటీ అనంతరం మాట్లాడుతూ ‘పోలవరం ఎత్తును తగ్గించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిలదీస్తాం. వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. ప్రత్యేక హోదా కోసం నినదిస్తాం. YCP కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులను పార్లమెంటులో చర్చిస్తాం’ అని పేర్కొన్నారు.
News November 21, 2024
రేణూ దేశాయ్ తల్లి కన్నుమూత
సినీ నటి రేణూ దేశాయ్ తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని రేణు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన తల్లి ఫొటో షేర్ చేసి ఓం శాంతి అంటూ పోస్ట్ చేశారు. దీంతో రేణును నెటిజన్లు ఓదారుస్తున్నారు. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచిస్తున్నారు.
News November 21, 2024
29న రాష్ట్రవ్యాప్తంగా BRS దీక్షా దివస్: KTR
TG: ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కరీంనగర్లో జరిగే దీక్షా దివస్లో తాను పాల్గొంటానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2009 నవంబర్ 29న తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు కావడంతో దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.