News November 21, 2024
అదానీ స్కాం: ఏపీ ప్రభుత్వానికి రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అభియోగాలు!
AP: అదానీపై అమెరికా మోపిన అభియోగాల్లో గత ప్రభుత్వం పేరు కూడా ఉంది. ఆనాటి ఏపీ ప్రభుత్వానికి రూ.1,750 కోట్ల లంచం ఇచ్చి సౌర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 2021లో అదానీ అప్పటి సీఎం జగన్‌ను కలిసిన తర్వాత ‘సెకీ’ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. అదానీ పవర్ నుంచి కొన్న విద్యుత్ ఏపీకి ఇవ్వాలని ‘సెకీ’ నిర్ణయించినట్లు వివరించారు.
Similar News
News December 4, 2024
GOOD NEWS: త్వరలో 1,00,204 ఉద్యోగాల భర్తీ
CAPF, అస్సాం రైఫిల్స్‌లో 1,00,204 ఉద్యోగ ఖాళీలున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. CRPF-33,730, CISF-31,782, BSF-12,808, ITBP-9,861, SSB-8,646, అస్సాం రైఫిల్స్‌లో 3,377 చొప్పున పోస్టులున్నట్లు చెప్పారు. UPSC, SSC ద్వారా త్వరగా భర్తీ చేస్తామన్నారు. వైద్యపరీక్షల సమయం తగ్గించి, కానిస్టేబుల్ GD కోసం షార్ట్ లిస్టైన వారి కటాఫ్ మార్కులు తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News December 4, 2024
వారిని ఎస్సీల్లో చేర్చండి.. కేంద్రానికి ఎంపీ బైరెడ్డి శబరి లేఖ
AP: రాష్ట్రంలోని బేడ బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌కు MP బైరెడ్డి శబరి లేఖ రాశారు. సంచార జాతులుగా పేరొందిన వీరు జానపద కథలు చెప్తూ జీవిస్తారు. దీంతో ఒక గ్రామానికి పరిమితం కాకపోగా ఇప్పటికీ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. వీరిని SCల్లో చేర్చడంలో కేంద్రం చొరవ చూపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News December 4, 2024
అస్సాంలో బీఫ్ తినడంపై బ్యాన్
అస్సాంలో బీఫ్ (గొడ్డు మాంసం)పై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. రెస్టారెంట్లు, ఫంక్షన్లు, బహిరంగ ప్రదేశాల్లో అన్ని మతాల వారు బీఫ్ తినడాన్ని బ్యాన్ చేస్తున్నామన్నారు. ఇది వరకు ఆలయాల దగ్గర ఈ నిషేధం విధించామని, ఇప్పుడా నిర్ణయం రాష్ట్రం మొత్తం వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించాలని లేదంటే పాకిస్థాన్ వెళ్లిపోవాలని మంత్రి పిజుష్ ట్వీట్ చేశారు.