News December 30, 2024

అదానీ షేర్లు అదుర్స్!

image

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు అదరగొడుతున్నాయి. క్రితం వారం నుంచి జోరు ప్రదర్శిస్తున్నాయి. నేడు అదానీ విల్మార్ మినహా అన్ని షేర్లూ పుంజుకున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 3.1, టోటల్ గ్యాస్ 2.5, ఎనర్జీ 1.8, ఏసీసీ 1.2, అదానీ పవర్, పోర్ట్స్, అంబుజా, NDTV, సంఘి, గ్రీన్ ఎనర్జీ షేర్లు ఒక శాతం మేర ఎగిశాయి. రేటింగ్ కంపెనీలు బయింగ్ కాల్స్ ఇస్తుండటం, వ్యాపార విస్తరణ, లాభదాయకత వంటివి మదుపరులను ఆకర్షిస్తున్నాయి.

Similar News

News January 21, 2025

ముగిసిన KRMB సమావేశం

image

TG: హైదరాబాద్‌ జలసౌధలో జరిగిన KRMB (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) సమావేశం ముగిసింది. ఇందులో ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా, బడ్జెట్ కేటాయింపు, బోర్డు నిర్వహణ, టెలి మెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించారు. ఈ భేటీలో బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్‌తోపాటు TG నీటిపారుదలశాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్ కుమార్, AP ENC వెంకటేశ్వరరావు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

News January 21, 2025

హైకోర్టులో మేరుగు నాగార్జునకు ఊరట

image

AP: వైసీపీ నేత మేరుగు నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన అత్యాచారం కేసును క్వాష్ చేయాలని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా తనను లైంగికంగా వేధించడంతోపాటు, తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఓ మహిళ మేరుగు నాగార్జునపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News January 21, 2025

ఫిబ్రవరి 20లోపు పిల్లలు పుడితేనే..

image

అమెరికాలో ఇక గ్రీన్ కార్డు లేదా <<15212260>>పౌరసత్వం<<>> ఉంటేనే అక్కడ పుట్టే పిల్లలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించనుంది. ఫిబ్రవరి 20, 2025 నుంచి ఈ ఉత్తర్వులు అమలు కానున్నాయి. దీన్ని బట్టి గ్రీన్ కార్డు, పౌరసత్వం లేని వారు ఆ లోపు పిల్లలకు జన్మనిస్తేనే సిటిజన్‌షిప్ వస్తుంది. ఆ తర్వాత H1B, స్టూడెంట్ వీసా (F1), గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న వారు, విజిటింగ్ వీసా ఉన్న వారు అక్కడ పిల్లలను కంటే పౌరసత్వం వర్తించదు.