News November 29, 2024
స్టాక్ మార్కెట్లకు అదానీ షేర్ల అండ

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు సూచీలకు అండగా నిలిచాయి. నిఫ్టీ 113 (24,038), సెన్సెక్స్ 325 (79,372) పాయింట్ల మేర ఎగిశాయి. మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫిన్, ITC, TCS, TECH M టాప్ లూజర్స్. CIPLA, సన్ ఫార్మా, ADANI PORTS, M&M, BEL టాప్ గెయినర్స్.
Similar News
News March 5, 2026
‘ఇండియా అతిథి’ని ముంచేశారు.. USకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్

శ్రీలంక తీరంలో తమ యుద్ధ నౌకను అమెరికా ముంచేయడంపై ఇరాన్ మండిపడింది. ‘ఇరాన్ తీరానికి 2 వేల మైళ్ల దూరంలో అమెరికా ఈ దారుణానికి పాల్పడింది. 130 మంది నావికులతో కూడిన ఫ్రిగేట్ దేనా.. ఇండియన్ నేవీకి అతిథి. కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నౌకను ముంచేశారు. నా మాటలను గుర్తుంచుకోండి. అమెరికా <<19299071>>చేసిన పనికి<<>> తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సిన టైం వస్తుంది’ అని విదేశాంగ మంత్రి అబ్బాస్ అఘార్చీ హెచ్చరించారు.
News March 5, 2026
జగన్ పాపాలే వైసీపీకి శాపాలు: మంత్రి ఆనం

AP: మండలిలో కల్తీ నెయ్యిపై చెలరేగిన మంటలు చల్లారడం లేదు. YCP సభ్యుల ఆందోళనల మధ్యే తిరుమల లడ్డూపై మంత్రి ఆనం ప్రసంగించారు. ‘నివేదికలు కల్తీ జరిగాయని చెబుతుంటే YCP దుష్ప్రచారం చేస్తోంది. కల్తీ జరిగినట్లు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నారు కదా? జగన్ పాపాలే ఆ పార్టీకి శాపాలుగా మారాయి. గోవిందుడి తిరునామం కన్నెర్రజేసింది కాబట్టే 11 సీట్లు వచ్చాయి’ అని విమర్శించారు. సభ రేపటికి వాయిదా పడింది.
News March 5, 2026
హలీం అమ్మకాలు: ₹2వేల కోట్లకు పైగా వ్యాపారం!

TG: రంజాన్‌లో HYD సహ రాష్ట్రంలో పలు పట్టణాల్లో హలీం అమ్మకాలు అత్యధికంగా జరుగుతుంటాయి. ఇతర ప్రాంతాలకూ ఎగుమతి అవుతుంటుంది. ఒక మోస్తరు రెస్టారెంట్లలో ప్లేట్ హలీంకు ₹320 కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. గత ఏడాది ₹1500CRకు పైగా విక్రయాలు జరిగాయి. GST 5% చెల్లించాల్సి ఉన్నా కట్టకపోవడంతో వాణిజ్యపన్నుల అధికారులు వ్యాపారులకు నోటీసులిచ్చారు. ఈ ఏడాది ₹2000CRకు పైగా అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.


