News November 21, 2024

హారతి కర్పూరంలా కరిగిపోయిన అదానీ సంపద

image

గౌతమ్ అదానీపై న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు లంచం, ఫ్రాడ్ అభియోగాలు నమోదు చేయడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు క్రాష్ అయ్యాయి. దాదాపుగా అన్ని కంపెనీల షేర్లు రోజువారీ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో 11 కంపెనీల స్టాక్స్ విలువ రూ.2.25 లక్షల కోట్లు తగ్గి రూ.12 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితా ప్రకారం గౌతమ్ అదానీ సంపద $10.5 బిలియన్లు తగ్గి $59.3 బిలియన్లకు చేరుకుంది.

Similar News

News November 22, 2024

ఫిల్ హ్యూస్ జ్ఞాపకార్థం క్రికెట్ ఆస్ట్రేలియా కార్యక్రమాలు

image

క్రికెట్ బాల్ తగిలి ఫిల్ హ్యూస్ కన్నుమూసి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అతడి జ్ఞాపకార్థం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. వచ్చే 3 షెఫీల్డ్ షీల్డ్ మ్యాచుల్లో ఆటగాళ్లు నల్ల బ్యాండ్స్ ధరిస్తారని తెలిపింది. 2014లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న సమయంలో షాన్ అబాట్ వేసిన బంతి హ్యూస్ ఎడమ చెవి కింద తగిలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవంబరు 27న కన్నుమూశారు.

News November 22, 2024

మణిపుర్‌‌కు మ‌రో 10,800 మంది జవాన్లు

image

మ‌ణిపుర్‌కు కేంద్రం మ‌రో 90 కంపెనీల నుంచి 10,800 మంది జవాన్లను పంప‌నుంది. మే, 2023 నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో 258 మంది మృతి చెందారు. తాజాగా CRPF, BSF, ITBP, SSB నుంచి అద‌న‌పు బ‌ల‌గాల మోహ‌రింపుతో మొత్తం 288 కంపెనీల సిబ్బంది అక్కడి ప‌రిస్థితుల్ని పర్యవేక్షించనున్నారు. Nov 7న జిరిబమ్‌‌లో హ్మర్ తెగకు చెందిన మహిళను అనుమానిత మైతేయి మిలిటెంట్లు రేప్ చేసి కాల్చి చంపడంతో తిరిగి ఘర్షణ చెలరేగింది.

News November 22, 2024

ఇటలీ ప్రధాని మెలోనికి PM మోదీ గిఫ్ట్

image

నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల్లో పర్యటించిన ప్రధాని మోదీ వివిధ దేశాధినేతలకు బహుమతులు ఇచ్చారు. జీ20 సమావేశాల్లో ఇటలీ ప్రధాని మెలోనికి సిల్వర్ క్యాండిల్ స్టాండ్, పోర్చుగల్ ప్రధానికి సిల్వర్ చెస్ సెట్, ఆస్ట్రేలియా ప్రధానికి సిల్వర్ క్యామెల్ హెడ్ అందజేశారు. మోదీ విదేశాలకు వెళ్లేటప్పుడు MH, జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు, యూపీ, లద్దాక్, ఒడిశాకు చెందిన హస్తకళలు తీసుకెళ్లారు.