News June 27, 2024

ADB: ఆశల పల్లకిలో MLAలు.. మంత్రి పదవి ఎవరికో..?

image

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రి పదవి ఊరిస్తోంది. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రెండో విడత జరగబోతోందనే ప్రచారం నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి విడత కూర్పులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా సీతక్క వ్యవహరిస్తున్నారు. పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఎవరిని పదవి వరిస్తుందోననే ఆత్రుత నెలకొంది.

Similar News

News February 15, 2026

ADB: రేపటి ప్రజావాణి రద్దు

image

ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికల దృష్ట్యా సోమవారం కలెక్టర్‌లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ప్రజావాణి లేనందున కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని జిల్లా ప్రజలకు సూచించారు.

News February 14, 2026

ఆదిలాబాద్: DSP, BSPకి పోలైన ఓట్లు ఇలా..!

image

మున్సిపల్ ఎన్నికల బరిలో ధర్మ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు సైతం పోటీ చేశాయి. కాగా ఎవరు కూడా ఒక వార్డును కూడా గెలుచుకోలేదు. BSP పోటీ చేసిన వార్డులలో ఏడో వార్డు అభ్యర్థికి 13 ఓట్లు, 30వ వార్డు అభ్యర్థికి 93 ఓట్లు, 39 వార్డు అభ్యర్థికి 67 ఓట్లు మొత్తం BSPకి 173 ఓట్లు పొలయ్యాయి. ఇక DSP రెండు వార్డులలో పోటీ చేసింది. 6వ వార్డు అభ్యర్థికి 17 ఓట్లు 39 వార్డు అభ్యర్థికి అత్యధికంగా 368 ఓట్లు వచ్చాయి.

News February 14, 2026

నిందితులకు శిక్ష పడేలా పనిచేయాలి: ADB SP

image

ప్రతి కేసులో నిందితులకు శిక్ష పడేలా పోలీసు అధికారులు పూర్తి పర్యవేక్షణతో వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ ఆదేశించారు. శనివారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కోర్టు డ్యూటీ అధికారులు, డీఎస్పీలు, సీఐలతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిందితులు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులు అందజేస్తామని ప్రకటించారు.