News February 4, 2025
ADB జిల్లా వాసికి ది బెస్ట్ ఆంకాలజిస్ట్ అవార్డ్
క్యాన్సర్ వ్యాధి నివారణకు 10 ఏళ్లుగా కృషి చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా వాసి డాక్టర్ ఉమాకాంత్ గౌడ్ ది బెస్ట్ ఆంకాలజిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు ప్రొఫెసర్లు అవార్డుకు ఎంపిక కాగా.. అందులో ADBలోని శాంతి నగర్‌కు చెందిన ఉమాకాంత్ గౌడ్ ఉన్నారు. ఈనెల 4న కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో అవార్డు అందుకోనున్నారు.
Similar News
News February 4, 2025
ఆదిలాబాద్: MALE నిరుద్యోగులకు GOOD NEWS
ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న TSKC ఆధ్వర్యంలో TASK సౌజన్యంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంగీత, TSKC కోఆర్డినేటర్ శ్రావణి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో HETERO లాబొరేటరీస్‌లో ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ లో పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఐటిఐ, మెకానికల్ డిప్లమా పాసైన యువకులు మాత్రమే అర్హులన్నారు. SHARE IT.
News February 4, 2025
ADB: టీబీ నిర్మూలన అందరి బాధ్యత: కలెక్టర్
టీబీ నిర్మూలన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్‌పై జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేశారు. టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి వైద్య సిబ్బందితో పాటు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్ ఉన్నారు.
News February 3, 2025
నేరడిగొండలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వాంకిడి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బోథ్ మండలం కౌట గ్రామానికి చెందిన నోముల వెంకట్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.