News April 14, 2026
ADB: జీవితం అంటే ఓటమి కాదు.. మరో అవకాశం..!

విద్యార్థులారా..! కాగితం మీద పడ్డ ‘ఫెయిల్’ ముద్ర, నీ నుదుటి రాతను మార్చలేదు. పదో తరగతిలో తడబడిన సచిన్, ప్రపంచం కొలిచే శిఖరమయ్యాడు.. నువ్వు విసిరేసిన ప్రాణం, నీ కన్నవారికి తీరని శోకమవుతుంది. ఓటమి అనేది ముగింపు కాదు.. నిన్ను నువ్వు దిద్దుకునే ఒక మలుపు..!. ఇంటర్ రిజల్ట్స్ తర్వాత ఉట్నూర్, నర్సాపూర్, ఖానాపూర్‌లో విద్యార్థుల ఆత్మహత్యలు ఉమ్మడి ఆదిలాబాద్‌ను కలవరపెట్టాయి. ఇలా చేయొద్దు.
Similar News
News April 14, 2026
HYD: BJPకి క్రైస్తవుల మద్దతు: TG చీఫ్

భిన్నత్వంలో ఏకత్వానికి, సర్వమత సామరస్యానికి భారతదేశం గొప్ప ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. HYDలో క్రైస్తవులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాను విశ్వసిస్తూ కేరళం, గోవా లాంటి రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజం పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు తెలుపుతుండటం హర్షణీయమన్నారు.
News April 14, 2026
SRCL: ‘ఆస్పత్రిలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి’

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. సోమవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. గత మూడు నెలల్లో ఔట్ పేషెంట్ లు 60,579 మంది, ఇన్ పేషెంట్ 3,939 మంది నమోదయ్యారని వైద్యులు కలెక్టర్‌కు తెలిపారు. జనవరి నుంచి మేజర్ ఆపరేషన్లు 365, మైనర్ ఆపరేషన్లు 993 చేశామని వెల్లడించారు.
News April 14, 2026
25 మంది సీఐల బదిలీ

రాయలసీమ జోన్ పరిధిలో 25 మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన 15 మంది అధికారులకు స్థానచలనం కలిగింది. వెయిటింగ్‌లో ఉన్న ఇద్దరు సీఐలకు కొత్త పోస్టింగులు ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బదిలీ అయిన వారు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.


