News September 17, 2025

ADB: డిగ్రీలో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శివకృష్ణ తెలిపారు. ఈనెల 18, 19న అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. బీఏలో 1, బీకాం (సీఏ)లో 3, బీఎస్సీ బీజేడ్సీలో 3, ఎంపీసీఎస్‌లో 14 , డాటా సైన్స్‌లో 22 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు 9849390495 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

Similar News

News February 14, 2026

నిందితులకు శిక్ష పడేలా పనిచేయాలి: ADB SP

image

ప్రతి కేసులో నిందితులకు శిక్ష పడేలా పోలీసు అధికారులు పూర్తి పర్యవేక్షణతో వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ ఆదేశించారు. శనివారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కోర్టు డ్యూటీ అధికారులు, డీఎస్పీలు, సీఐలతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిందితులు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులు అందజేస్తామని ప్రకటించారు.

News February 14, 2026

సైబర్ మోసాలపై అప్రమత్తతే రక్షణ: ADB SP

image

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. APK లింకులు, AI వీడియో కాల్స్, పెట్టుబడి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ వారం జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. బాధితులు మోసపోయిన వెంటనే గోల్డెన్ అవర్‌లో 1930కు ఫిర్యాదు చేస్తే నగదు తిరిగి పొందే అవకాశం ఉంటుందని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలపవద్దని ఆయన స్పష్టం చేశారు.

News February 14, 2026

ADB: పుర పీఠం.. బద్ధ శత్రువుల’ కలయిక నిజమేనా?

image

ADB మున్సిపాలిటీలో ఛైర్మన్ పీఠం దక్కించుకోవడం ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. మొత్తం 51 స్థానాలకు గాను మేజిక్ ఫిగర్ 26 కాగా, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్(11), BRS(6), MIM(6) కలిసినా మెజారిటీకి ఇంకా ముగ్గురు స్వతంత్రుల మద్దతు అవసరం. మరోవైపు స్వతంత్రులు తమ వెంటే ఉన్నారని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. పరస్పర విరుద్ధ భావజాలం గల పార్టీలు పీఠం కోసం జతకడతాయా అన్నది వేచి చూడాలి.