News March 6, 2025
ADB: మందు తాగిన దంపతులు.. భర్త మృతి

నేరడిగొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడూర్ గ్రామానికి చెందిన రైతు ఈదపు పోశెట్టి (60), అతడి భార్య ఇందిర(52) అప్పుల బాధ భరించలేక గురువారం పురుగు మందు తాగారు. ఈ ఘటనలో పోశెట్టి మృతి చెందగా ఇందిర పరిస్థితి విషమంగా ఉంది. పంట సాగులో నష్టం రావడం, ఇద్దరు పిల్లలకు పెళ్లి చేయడంతో అప్పులు అయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News March 6, 2025
నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 357 సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో BSFలో 24, CRPFలో 204, CISFలో 92, ITBPలో 4, SSBలో 33 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసి, 20-25 ఏళ్ల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 25.
సైట్: upsc.gov.in/
News March 6, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>జీకే వీధి: మంచుతోనే పంట సాగు చేయవచ్చు >పాడేరులో ఆదివాసీ ఆత్మగౌరవ దీక్షలు>ఈనెల 7నుంచి యథావిధిగా మీకోసం కార్యక్రమం>అల్లూరి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు>అల్లూరి జిల్లాలో 650 మంది గైర్హాజర్>పది పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలి..జిల్లా విద్యాధికారి>అల్లూరి: వాట్సాప్ నుంచి SSC హాల్ టికెట్లు>రంపచోడవరం: తాటాకు, వెదురు ఉత్పత్తులకు మంచి డిమాండ్
News March 6, 2025
బాపట్ల జిల్లాలో TODAY TOP HEADLINES

◆నిజాంపట్నం: పదవ తరగతి పరీక్ష కేంద్రాల పరిశీలన◆భట్టిప్రోలు: రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం◆వేటపాలెం: పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ◆రేపల్లె: ‘లోక్ అదాలత్లో కేసులు పరిష్కరిద్దాం’◆బాపట్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమం◆పరీక్షలు బాగా రాశాం: ఇంటర్ విద్యార్థులు◆విలేకరుల పేరుతో బెదిరింపులు.. బాపట్ల సీఐ వార్నింగ్◆గతం గురించి అవసరం లేదు: మాజీ మంత్రి దగ్గుబాటి