News September 9, 2024

బాధితులకు బాసటగా నిలిచిన ఆపద్బాంధవులు

image

AP: విరామం లేదు. విశ్రాంతి లేదు. ఆగస్టు 31న వరదలు వచ్చినప్పటి నుంచి వాటిల్లో చిక్కుకున్న వారిని రక్షించాలన్న ఏకైక లక్ష్యంతో NDRF, SDRF, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా, నిర్విరామంగా సేవలు అందించారు . వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్షలాదిగా ఆహారం, నీరు, పాలు ప్యాకెట్లు అందించి వారి ఆకలి తీర్చారు. ముంపు సమయంలో బెజవాడలో విస్తృత సేవలు అందించిన వీరికి సెల్యూట్ చేయాల్సిందే.

Similar News

News December 4, 2025

తొలి విడత.. ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్!

image

TG: రాష్ట్రంలో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థులకు తెలుగు అక్షర క్రమం ఆధారంగా EC గుర్తులు కేటాయించింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి 30 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవమైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. మొత్తంగా 400కుపైగా స్థానాలు ఏకగ్రీవమవుతాయని అంచనా వేశాయి. రెండో విడతలో 4,332 సర్పంచ్ స్థానాలకు 28,278 మంది, 38,342 వార్డు స్థానాలకు 93,595 మంది నామినేషన్లు వేసినట్లు సమాచారం.

News December 4, 2025

అమరావతిలో భూసమీకరణపై ప్రశ్నలు!

image

AP: రాజధాని అమరావతిలో భూసమీకరణపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో సేకరించిన 32వేల ఎకరాల్లో పనులు ఓ కొలిక్కి రాకముందే రెండో విడతలో 16వేల ఎకరాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మూడో విడత భూసేకరణ కోసం కసరత్తు చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గన్నవరంలో విమానాశ్రయం ఉండగా అమరావతిలో మరో ఎయిర్‌పోర్ట్ ఎందుకని అంటున్నారు. దీనిపై మీ COMMENT?

News December 4, 2025

ఏయే పూజలకు ఏ సమయం అనుకూలం?

image

పౌర్ణమి తిథి నేడు ఉదయం 8.37AMకి ప్రారంభమై, రేపు తెల్లవారుజామున 4.43AMకి ముగుస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజు చేసే ఏ పూజలైనా, వ్రతాలైనా ఈ సమయంలో చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. నేడు ఉదయం 6.59AM – 2.54PM మధ్యలో రవి యోగం ఉంటుందని, ఈ సమయంలో పవిత్ర స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని అంటున్నారు. లక్ష్మీ, సత్యనారాయణ వ్రతాలతో పాటు శివాభిషేకం, ఇతర పూజలు ప్రదోష కాలంలో చేయాలంటున్నారు.