News September 9, 2024

బాధితులకు బాసటగా నిలిచిన ఆపద్బాంధవులు

image

AP: విరామం లేదు. విశ్రాంతి లేదు. ఆగస్టు 31న వరదలు వచ్చినప్పటి నుంచి వాటిల్లో చిక్కుకున్న వారిని రక్షించాలన్న ఏకైక లక్ష్యంతో NDRF, SDRF, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా, నిర్విరామంగా సేవలు అందించారు . వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్షలాదిగా ఆహారం, నీరు, పాలు ప్యాకెట్లు అందించి వారి ఆకలి తీర్చారు. ముంపు సమయంలో బెజవాడలో విస్తృత సేవలు అందించిన వీరికి సెల్యూట్ చేయాల్సిందే.

Similar News

News April 13, 2026

పిచ్చి పీక్స్.. చందమామపై ‘ట్రంప్ టవర్’

image

చంద్రునిపై తన పేరుతో టవర్ ఉన్నట్లు చూపే AI ఫొటోను US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ SM అకౌంట్‌లో పోస్ట్ చేశారు. నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఆయన ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. గోల్డ్ ఫినిషింగ్‌తో మెరిసిపోతున్న ఈ భవనం చంద్రమండలంపై అమెరికా ఆధిపత్యాన్ని సూచిస్తున్నట్లుగా ఉంది. అంతరిక్ష రంగంలో US ఎప్పటికీ టాప్‌లో ఉంటుందని తెలిపేలా ట్రంప్ ఈ విధంగా పోస్ట్ చేశారు.

News April 13, 2026

రాకా: సైన్స్ ఫిక్షన్+ మైథాలజీ?

image

అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’లో అల్లు అర్జున్ లుక్ మూవీపై హైప్‌ను పెంచింది. ఈ చిత్రంపై ఓ క్రేజీ బజ్ వైరలవుతోంది. ఇందులో సైన్స్ ఫిక్షన్‌తోపాటు మైథాలజీని కూడా టచ్ చేసినట్లు సమాచారం. తోడేళ్లకు సంబంధించి పురాణాల్లో ఉన్న ఆసక్తికర అంశాలను ఈ సినిమాలో మిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రాజెక్టుకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తుండగా దీపికా పదుకొణె, రష్మిక కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాక్.

News April 13, 2026

PHOTO: కండలు తిరిగిన శరీరంతో Jr.NTR

image

‘డ్రాగన్’ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ కండలు తిరిగిన బాడీ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది క్షణాల్లోనే వైరలైంది. తారక్ బాడీ బాక్సాఫీస్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.