News April 4, 2024
నాన్ లోకల్ అభ్యర్థుల అడ్డా ‘వైజాగ్’(3/3)
విశాఖ పార్లమెంట్ స్థానంలో ఈసారి వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ, కూటమి నుంచి TDP అభ్యర్థిగా M.భరత్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కూడా స్థానిక అంశంతోనే బరిలో దిగుతున్నారు. తాను విజయనగరం కోడలు అయినప్పటికీ పుట్టినిల్లు విశాఖేనని ఝాన్సీ చెబుతున్నారు. గీతం వర్సిటీ సహా అనేక విద్యాసంస్థలను నెలకొల్పిన తాము కూడా విశాఖ వాసులమేనని భరత్ అంటున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 8, 2024
ప్రపంచ ధ్యాన దినోత్సవంగా DEC 21
ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలన్న ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ వెల్లడించారు. భారత్, శ్రీలంక, నేపాల్, మెక్సికో దేశాల బృందం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని తెలిపారు. ‘సర్వజన శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఓ రోజు. డిసెంబర్ 21న ధ్యాన దినోత్సవంగా జరుపుకునేందుకు భారత్ మార్గనిర్దేశం చేసింది’ అని పేర్కొన్నారు.
News December 8, 2024
నాగార్జునసాగర్ నుంచి APకి 12TMC నీరు
నాగార్జునసాగర్ నుంచి APకి 12TMCల నీరు విడుదల కానుంది. 15.86TMCల నీటిని విడుదల చేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB)ను AP ప్రభుత్వం కోరింది. కాగా, ఇప్పటికే వాడుకున్న జలాలను పరిగణనలోకి తీసుకొని 12TMCల నీటిని జనవరి 31 వరకు విడుదల చేసేందుకు KRMB అనుమతి ఇచ్చింది. గత నెల 25తేదీ నాటికి 9.55TMCల నీటిని వాడుకున్నామని, 32.25TMC జలాలను వాడుకునేందుకు అర్హత ఉందని AP ప్రభుత్వం లేఖలో తెలిపింది.
News December 8, 2024
ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం కొత్త రూల్స్
అత్యవసర పరిస్థితుల్లో ఐజీ లేదా ఆ పైస్థాయి పోలీస్ ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశించవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ట్యాపింగ్‌కు ఆదేశించిన అధికారి సదరు ఆదేశాలు నిజమైనవేనని 7 పనిదినాల్లో నిర్ధారించకపోతే ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటాను దేనికీ వాడొద్దని, 2 రోజుల్లో ఆ డేటాను ధ్వంసం చేయాలని తెలిపింది. ట్యాపింగ్ ఆదేశాలను సంబంధిత శాఖల కార్యదర్శుల కమిటీ సమీక్షించాల్సి ఉంటుందని పేర్కొంది.