News April 29, 2024

క్రెడిట్‌ కార్డుదారులకు అదనపు భారం!

image

క్రెడిట్ కార్డులతో చెల్లించే యుటిలిటీ బిల్లులపై సేవా రుసుం వసూలు చేసేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రెంట్‌పై ఈ రుసుము వసూలు చేస్తుండగా.. ఇకపై విద్యుత్, ఫోన్, గ్యాస్ బిల్లులపైనా వడ్డించనున్నాయి. మే 1 నుంచి ఎస్ బ్యాంక్, IDFC బ్యాంకులు యుటిలిటీ బిల్లులపై 1శాతం రుసుము వసూలు చేయనున్నాయి. ఆదాయం పెంపు, క్రెడిట్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 28, 2024

నేడు స్కూళ్లకు సెలవు ఉందా?

image

మాజీ PM మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్రం ఇవాళ హాఫ్ డే సెలవు ఇచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది. విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ హాలిడే వర్తించదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు ఇవాళ యధావిధిగా పనిచేయనున్నాయి. కాగా, నిన్న తెలంగాణలో ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు ప్రకటించారు.

News December 28, 2024

వాచ్‌మెన్‌కు జాక్‌పాట్.. లాటరీలో రూ.2.32కోట్లు

image

దుబాయ్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న HYDకు చెందిన రాజమల్లయ్య(60)కు జాక్‌పాట్ తగిలింది. ఇటీవల ప్రకటించిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రాలో ఆయన మిలియన్ దిర్హామ్స్(రూ.2.32 కోట్లు) గెలుచుకున్నారు. దీంతో మల్లయ్య సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తాను 30ఏళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నానని, ఇప్పుడు అదృష్టం వరించిందని తెలిపారు. ఈ మొత్తాన్ని కుటుంబం, స్నేహితులతో పంచుకుంటానని తెలిపారు.

News December 28, 2024

దటీజ్ మన్మోహన్: ఆపరేషన్ తర్వాత తొలి ప్రశ్న.. ‘నా దేశం ఎలా ఉంది?’

image

మన్మోహన్ సింగ్‌ ప్రధానిగా ఉండగా 2009లో హార్ట్ సర్జరీ జరిగింది. 11 గంటల శస్త్రచికిత్స తర్వాత బ్రీతింగ్ పైప్ తీసేయగానే ఆయన తన ఆరోగ్యం గురించి కాకుండా దేశం ఎలా ఉంది? కశ్మీర్ ఎలా ఉంది? అని అడిగారు. తన ధ్యాసంతా సర్జరీపై కాకుండా దేశంపైనే ఉందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయనకు సర్జరీ చేసిన డాక్టర్ రమాకాంత్ పాండా ఓ సందర్భంలో వెల్లడించారు. మన్మోహన్ మానసికంగా చాలా బలంగా ఉండేవారని తెలిపారు.