News April 29, 2024
క్రెడిట్ కార్డుదారులకు అదనపు భారం!
క్రెడిట్ కార్డులతో చెల్లించే యుటిలిటీ బిల్లులపై సేవా రుసుం వసూలు చేసేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రెంట్‌పై ఈ రుసుము వసూలు చేస్తుండగా.. ఇకపై విద్యుత్, ఫోన్, గ్యాస్ బిల్లులపైనా వడ్డించనున్నాయి. మే 1 నుంచి ఎస్ బ్యాంక్, IDFC బ్యాంకులు యుటిలిటీ బిల్లులపై 1శాతం రుసుము వసూలు చేయనున్నాయి. ఆదాయం పెంపు, క్రెడిట్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 7, 2024
INDIA A: మళ్లీ అదే కథ
ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఇండియా ఏ బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రస్తుతం భారత్ 64 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్ డకౌటయ్యారు. సీనియర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో ధ్రువ్ జురేల్ (24*), నితీశ్ రెడ్డి (0*) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మైకేల్ నెసెర్ 4 వికెట్లతో చెలరేగారు.
News November 7, 2024
డెంగ్యూ వ్యాప్తిని నివారించేందుకు కొత్త పద్ధతి
డెంగ్యూ, జికా, వైరల్ ఫీవర్ వ్యాప్తిని నివారించేందుకు పరిశోధకులు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఈడిస్ ఈజిప్టి అనే దోమల ద్వారా ఈ వ్యాధులు వ్యాపిస్తాయి. వీటిల్లో మగ దోమల వినికిడి శక్తిని దెబ్బతీస్తే అవి ఆడవాటితో జతకట్టలేవని ప్రొఫెసర్ క్రైగ్ మాంటెల్ ల్యాబ్‌లోని పరిశోధకులు తెలిపారు. ఆడ దోమలు రెక్కలతో చేసే చప్పుడు సంభోగానికి సంకేతమని, వినికిడి శక్తిని కోల్పోతే మగవి సంభోగానికి ఆసక్తి చూపవని చెప్పారు.
News November 7, 2024
IPL: రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌లో మనోళ్లు వీరే
IPL మెగా వేలంలో ఈసారి భారత్ నుంచి 23 మంది ఆటగాళ్లు రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో బరిలోకి దిగుతున్నారు. వీరిలో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అశ్విన్, చాహల్, వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్, పడిక్కల్, కృనాల్ పాండ్య, షమీ, సిరాజ్, అర్ష్‌దీప్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్, ముకేశ్, ప్రసిద్ధ్ కృష్ణ, నటరాజన్, హర్షల్ పటేల్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ ఉన్నారు.