News June 2, 2024
బెంగాల్, ఏపీలో 15 రోజుల పాటు అదనపు భద్రత?

ఎన్నికల్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఏపీ, బెంగాల్ రాష్ట్రాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడైన 15రోజుల వరకు కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు యూపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ల రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడైన రెండు రోజుల వరకు కేంద్ర బలగాలు గస్తీ కాయనున్నాయి.
Similar News
News December 14, 2025
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు: నాగబాబు

AP: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని నటుడు, MLC నాగబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం(D) లావేరులో జరిగిన జనసేన మీటింగ్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘MLAగా పోటీ చేయాలనుకుంటే వచ్చే ఎన్నికల వరకు ఎందుకు? గత ఎన్నికల్లోనే పోటీ చేసేవాడిని. 5-6 ఏళ్ల తర్వాత సంగతి చెప్పమంటే ఏం చెబుతాం. జనసేన ప్రధాన కార్యదర్శిగా కంటే జనసేన కార్యకర్త అనిపించుకోవడంలోనే సంతృప్తి ఉంటుంది’ అని తెలిపారు.
News December 14, 2025
యూరినరీ ఇన్కాంటినెన్స్కు ఇలా చెక్

40-50 ఏళ్లు పైబడిన మహిళల్లో యూరినరీ ఇన్కాంటినెన్స్(మూత్రంపై పట్టుకోల్పోవడం) సమస్య వస్తుంటుంది. దీనివల్ల తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు యూరిన్ లీకేజీ అవుతుంది. క్రమంగా ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అయితే 12 వారాలపాటు వ్యాయామాలు, యోగా చేస్తే ఈ సమస్యను అదుపు చేయొచ్చని ‘స్టాన్ఫర్డ్ మెడిసిన్’ అధ్యయనంలో తేలింది. మందులతో సమానంగా దీని ఫలితాలు ఉంటాయని వెల్లడైంది. #WomenHealth
News December 14, 2025
వారంలో రూ.14,100 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల హవా కొనసాగుతోంది. ఈ వారంలో(DEC 7-13) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,760 పెరిగి రూ.1,33,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,450 పెరగడంతో రూ.1,22,750గా ఉంది. ఇక కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో రూ.14,100 పెరిగి రూ.2,10,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.


