News February 15, 2025
ADE అక్రమాస్తులు రూ.100 కోట్లు!

TG: గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్ నివాసంలో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. HYD, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22ఎకరాల భూమి, ప్లాట్లు, విల్లా, భవనాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. అలాగే బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిన్న రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి దొరికారు. సోదాల అనంతరం సతీశ్‌ను అరెస్ట్ చేశారు.
Similar News
News November 20, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

*శ్రీకాకుళం(D) ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన చేసేందుకు ICMR ఆమోదం తెలిపింది. మూడేళ్లలో పరిశోధన పూర్తి చేసేందుకు రూ.6.2 కోట్లు ఇవ్వనుంది: మంత్రి సత్యకుమార్
*వైసీపీ పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారు. జగన్ చేసిన మంచి పనులకు తన స్టాంప్ వేసుకుని క్రెడిట్ చోరీ చేయాలని ఆలోచిస్తున్నాడు: కన్నబాబు
*ఇవాళ బిహార్ CMగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న CM చంద్రబాబు, మంత్రి లోకేశ్.
News November 20, 2025
‘కొదమసింహం’ నాకు, చరణ్‌కు ఫేవరేట్ మూవీ: చిరంజీవి

తనకు కౌబాయ్ మూవీస్ అంటే ఇష్టమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘కొదమసింహం సినిమాలో నా స్టిల్ చాలా పాపులర్. తొలిసారి నేను గడ్డం పెంచి నటించిన సినిమా ఇది. నాకు, రామ్ చరణ్‌కు ఫేవరేట్ మూవీ’ అని తెలిపారు. కొదమసింహం సినిమాను ఈ నెల 21న రీ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీమియర్ షో, ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని వీడియో ద్వారా చిరంజీవి గుర్తుచేసుకున్నారు.
News November 20, 2025
నితీశ్ రికార్డు.. బిహార్ సీఎంగా పదోసారి

బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. రికార్డు స్థాయిలో 10వ సారి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2000 మార్చిలో కేవలం వారం రోజులే నితీశ్ సీఎంగా ఉన్నారు. తర్వాత 2005 నుంచి జరిగిన 5 ఎన్నికల్లోనూ ఇతర పార్టీల పొత్తుతో గెలిచి అధికారం చేపట్టారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేశారు. ఇటు NDAతో, అటు MGBతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలగడం ఆయన స్పెషాలిటీ.


