News February 15, 2025
ADE అక్రమాస్తులు రూ.100 కోట్లు!

TG: గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్ నివాసంలో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. HYD, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22ఎకరాల భూమి, ప్లాట్లు, విల్లా, భవనాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. అలాగే బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిన్న రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి దొరికారు. సోదాల అనంతరం సతీశ్‌ను అరెస్ట్ చేశారు.
Similar News
News March 28, 2025
ఏడాదిలో రూ.23,730 పెరిగిన గోల్డ్ ధర

దేశంలో బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. గత ఏడాది ఏప్రిల్ 1న ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేటు(24 క్యారెట్లు) రూ.68,420 ఉండగా, ఇవాళ రూ.92,150కి చేరింది. ఏడాదిలో ఏకంగా రూ.23,730 పెరిగింది. <<15912228>>హైదరాబాద్‌లోనూ<<>> స్వచ్ఛమైన పసిడి ధర రూ.90,980 పలుకుతోంది. అంతర్జాతీయ ట్రేడ్ వార్స్ కారణంగా వృద్ధికి ఆటంకం కలుగుతుందనే ఆందోళనలు బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
News March 28, 2025
31న ‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ సింగిల్

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న ‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 31న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘నాయాల్ది’ అంటూ సాగే ఈ పాట పోస్టర్‌ను SMలో షేర్ చేశారు. ఈ చిత్రంలో కళ్యాణ్ తల్లిగా, పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి కీలకపాత్ర పోషిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
News March 28, 2025
ఆయనకు న్యాయపరమైన విధులు వద్దు: సుప్రీంకోర్టు

జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు న్యాయపరమైన విధులు అప్పగించవద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. కాగా జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్దఎత్తున నోట్ల కట్టలు బయటపడటంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు.