News May 25, 2024

$100 బిలియన్ల క్లబ్‌లోకి ఆదిత్య బిర్లా గ్రూప్

image

ఆదిత్య బిర్లా గ్రూప్ మార్కెట్ విలువ $100 బిలియన్ల మార్క్ (రూ.8,51,460 కోట్లు) దాటింది. దీంతో టాటా గ్రూప్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్ తదితర సంస్థల జాబితాలో చేరింది. ఈ గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్‌కో సహా 12 సంస్థల షేర్లు పుంజుకోవడంతో ఈ ఘనత సాధించింది. మార్కెట్ విలువ దాదాపు 35% అల్ట్రాటెక్ సిమెంట్‌దే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్ విలువ రూ.2.95లక్షల కోట్లుగా ఉంది.

Similar News

News February 18, 2025

BREAKING: కొత్త CECగా జ్ఞానేశ్ కుమార్

image

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌(CEC)గా జ్ఞానేశ్ కుమార్ ఎంపికయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జ్ఞానేశ్ కుమార్ పేరు గత కొన్ని రోజులుగా అందరి నోటా నానుతుండగా ఈరోజు అధికారికంగా ప్రకటన వెలువడింది. ప్రస్తుత CEC రాజీవ్ కుమార్ పదవీకాలం రేపటితో ముగియనుంది.

News February 18, 2025

ఎండాకాలం: ఈసారి హాటెస్ట్ సిటీగా బెంగళూరు!

image

దేశంలో ఈసారి ఎండలు మండిపోతాయని, అత్యంత వేడి నగరంగా బెంగళూరు నిలవనుందని IMD అంచనా వేసింది. ఏటా వేసవిలో ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఢిల్లీ కంటే బెంగళూరులోనే రికార్డ్ స్థాయి టెంపరేచర్ నమోదవుతుందని పేర్కొంది. సిలికాన్ సిటీలో ఇవాళ 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, ఢిల్లీలో 27 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదవడం గమనార్హం.

News February 17, 2025

టీమ్ ఇండియా ఫొటోషూట్.. పిక్స్ వైరల్

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమ్ ఇండియా ఫొటో సెషన్‌లో పాల్గొంది. ఇందులో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు సందడి చేశారు. టీ20 టీమ్, టెస్టు టీమ్ క్యాప్‌లు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ జెర్సీలపై పాకిస్థాన్ అని పేరు రాసి ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

error: Content is protected !!