News November 29, 2024
ఛాంపియన్స్ ట్రోఫీపై ICC సమావేశం వాయిదా
ఛాంపియన్స్ ట్రోఫీపై ICC కీలక సమావేశం శనివారానికి వాయిదా పడింది. జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ఆతిథ్య పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీని పాక్‌లో కొనసాగించినా భారత మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిలో తటస్థ వేదికలపై నిర్వహించాలని BCCI కోరింది. ఈ విషయాన్ని తేల్చడానికి ICC తలపెట్టిన కీలక సమావేశం అనూహ్యంగా రేపటికి వాయిదా పడింది.
Similar News
News December 11, 2024
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
TG: రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’, తెలంగాణ తల్లి ఫొటోను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి పదో తరగతి టెక్ట్స్ బుక్‌ల్లో ఇవి కనిపించనున్నాయి. ప్రస్తుత పుస్తకాల్లో ప్రతిజ్ఞతోపాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి. ఇక వచ్చే ఏడాదీ విద్యార్థులకు పాత సిలబస్సే ఉంటుందని, 2026-27లో సిలబస్ మారే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు.
News December 11, 2024
‘ఉపాధి’ కూలి రోజుకు రూ.300
AP: ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు రూ.300 ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు రూ.255 కూలి ఇస్తుండగా దీనిని రూ.300కు పెంచేందుకు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. పనులు ఎలా చేపడితే రూ.300 కూలి వస్తుందో కూలీలు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు. దీనిపై కలెక్టర్లు, డ్వామా PDలకు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ ఉత్తర్వులు జారీ చేశారు.
News December 11, 2024
BITCOIN: 3 రోజుల్లో రూ.5.5 లక్షల నష్టం
క్రిప్టో కరెన్సీ మార్కెట్లో బలహీనత కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే ఇందుకు కారణం. లక్ష డాలర్ల స్థాయిని తాకాక బిట్‌కాయిన్ క్రమంగా పతనమవుతోంది. 3 రోజుల్లోనే $6500 (Rs 5.5L) మేర నష్టపోయింది. ఇవాళ $96,593 వద్ద మొదలైన BTC $539 నష్టంతో $96,093 వద్ద ట్రేడవుతోంది. Mcap $1.94 ట్రిలియన్ల నుంచి $1.91 ట్రిలియన్లకు తగ్గింది. ETH, USDT, XRP, SOL, BNP, DOGE, USDC, ADA, TRX కాయిన్లూ నష్టాల్లోనే ఉన్నాయి.