News September 5, 2024
మద్యం షాపుల బంద్ వాయిదా

AP: రాష్ట్రంలో ఈ నెల 7 నుంచి <<13980417>>చేపట్టాల్సిన<<>> మద్యం షాపుల బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు బేవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్ వైజర్లు, సేల్స్మెన్లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో బంద్ చేపడతామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News February 6, 2026
ఓడిపోయాక పబ్లిసిటీ కోసం కోర్టులను ఆశ్రయించవద్దు: SC

బిహార్ అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలంటూ ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పబ్లిసిటీ కోసం కోర్టులను ఆశ్రయించవద్దు” అని ఘాటుగా వ్యాఖ్యానించింది. కాగా గత ఏడాది జరిగిన బిహార్ ఎన్నికల్లో PK పార్టీ 238 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలవలేదు.
News February 6, 2026
OFFICIAL: ఈనెల 11న OTTలోకి చిరు ‘MSVPG’

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా ఓటీటీ రిలీజ్ తేదీ వచ్చేసింది. ఈనెల 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్కు రానున్నట్లు OTT ప్లాట్‌ఫామ్ ‘జీ5’ వెల్లడించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిశారు.
News February 6, 2026
TGకి రూ.12 లక్షల కోట్లు ఇచ్చాం: ప్రహ్లాద్ జోషి

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన HYDలో మీడియాతో మాట్లాడారు. ‘మోదీ పాలనలో TGకి ₹12 లక్షల కోట్లు ఇచ్చాం. వ్యవసాయం, మౌలిక వసతులు, హైవేల నిర్మాణానికి ఎక్కువగా వెచ్చించాం. పన్నుల వాటాను 32 నుంచి 41%కి పెంచి ఇప్పటి వరకు ₹2.52 లక్షల కోట్లు ఇచ్చాం. UPA హయాంలో ₹60వేల కోట్లు కూడా ఇవ్వలేదు’ అని విమర్శించారు.


