News September 5, 2024

మద్యం షాపుల బంద్ వాయిదా

image

AP: రాష్ట్రంలో ఈ నెల 7 నుంచి <<13980417>>చేపట్టాల్సిన<<>> మద్యం షాపుల బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు బేవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్ వైజర్లు, సేల్స్‌మెన్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో బంద్ చేపడతామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News September 12, 2024

టుడే టాప్ స్టోరీస్

image

➣AP: దెబ్బతిన్న ఎకరా వరికి రూ.10వేల పరిహారం: CBN
➣TG: అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై పూర్తి బాధ్యత నాదే: రేవంత్
➣AP: చంద్రబాబు వల్ల 60 మందికి పైగా చనిపోయారు: జగన్
➣AP: తక్కువ ధరలకే మద్యం అందించేలా పాలసీ: మంత్రి కొల్లు
➣TG: త్వరలో 4వేల ఉద్యోగాల భర్తీ చేస్తాం: మంత్రి దామోదర
➣TG: HYDలో రియల్ ఎస్టేట్ పడిపోయింది: హరీశ్
➣ ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి 70 ఏళ్ల పైబడినవారు

News September 12, 2024

ఏ వయసు వారు ఎంతసేపు నిద్రపోవాలంటే?

image

* అప్పుడే పుట్టిన పిల్లలు: 18 గంటలు
* 4-11 నెలల చిన్నారులు: సుమారు 15 గంటలు
* 3-5 ఏళ్ల పిల్లలు: 13 గంటలు
* 6-12 ఏళ్ల పిల్లలు: 9-12 గంటలు
* 13-18 ఏళ్ల వారు: కనీసం 8 గంటలే
* 18-60 ఏళ్ల వారు: 7-9 గంటలు
* 60 ఏళ్లు పైబడినవారు: 7-8 గంటలు
** లేదంటే శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి.

News September 12, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

image

పెన్షన్ల జారీలో ఆలస్యంతో ఉద్యోగుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు పదవీ విరమణ చేసే నాటికి పెన్షన్ కచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ విభాగం ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. CSS రూల్ 2021లో పేర్కొన్నట్లు నిర్ణీత కాలంలో పెన్షన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలంది.