News July 25, 2024
తెలుగు వర్సిటీలో ప్రవేశాలు TG విద్యార్థులకే!
TG-AP మధ్య పదేళ్ల ఉమ్మడి రాజధాని ఒప్పందం జూన్ 2తో ముగిసింది. దీంతో HYDలోని నాంపల్లిలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూడా తెలంగాణకే పరిమితం కానుంది. ఈ ఏడాది కూడా తమ విద్యార్థులను చేర్చుకోవాలని AP ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై తుది నిర్ణయం వెలువడలేదు. దీంతో TG విద్యార్థుల ప్రయోజనం దృష్ట్యా ప్రవేశాలను కేవలం తెలంగాణకే పరిమితం చేస్తూ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది.
Similar News
News October 11, 2024
ఇంగ్లండ్ చేతిలో పాక్ ఘోర పరాజయం
ముల్తాన్ టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాభవంపాలైంది. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్‌పై తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 556 పరుగులు చేశాక కూడా ప్రత్యర్థి చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. ఇలా ఓడిన తొలిజట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్ తమ ఇన్నింగ్స్‌ను 823-7 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 220కే ఆలౌటైంది. లీచ్ 4 వికెట్లు పడగొట్టారు.
News October 11, 2024
యువకుడి కడుపులో ప్రాణాలతో బొద్దింక.. వైద్యులు ఏం చేశారంటే?
ఢిల్లీ డాక్టర్లు ఓ యువకుడి కడుపులో బతికి ఉన్న బొద్దింకను ఎండోస్కోపి ద్వారా తొలగించారు. గత కొంత కాలంగా యువకుడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా పరీక్షించిన ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు చిన్న పేగుల్లో బొద్దింక ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అతనికి ఎండోస్కోపి చేసి దానిని తొలగించారు. అన్నం తింటుండగా లేదా నిద్రిస్తున్న సమయంలో నోటి ద్వారా బొద్దింక లోపలికి వెళ్లి ఉంటుందని చెప్పారు.
News October 11, 2024
East Asia సదస్సులో మోదీ రికార్డ్
East Asia సదస్సులో హోస్ట్, కాబోయే ఛైర్‌పర్సన్ తర్వాత మాట్లాడే మొదటి అతిథి ప్రధాని నరేంద్రమోదీ అని తెలిసింది. ఇప్పటి వరకు ఈ సదస్సు 19 సార్లు జరగ్గా 9 సార్లు పాల్గొన్న ఏకైక నేతగా ఆయన రికార్డు సృష్టించారు. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, శాంతి గురించి ఆయన మాట్లాడతారు. క్వాడ్ పాత్రను వివరిస్తారు. లావోస్ బయల్దేరే ముందు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఇక ASEANలోనూ భారత్ పాత్ర, ప్రాముఖ్యం పెరిగింది.