News January 8, 2025

గురుకులాల్లో ప్రవేశాలు.. ఇలా అప్లై చేసుకోండి!

image

TG: వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకులాల్లో 5-9 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. <>https://tgcet.cgg.gov.in<<>> సైట్‌లో ఫిబ్రవరి 1లోపు అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష (TG CET)ను ఫిబ్రవరి 28న నిర్వహిస్తారు. SC, ST, BC, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి, SC, ST గురుకులాల్లో 6-9, TGSWREIS గౌలిదొడ్డి, అలుగునూరు COEలలో 9, TGTWREIS ఖమ్మం, పరిగి SOEలలో ఎనిమిదో తరగతి ప్రవేశాలకు సీట్లను భర్తీ చేస్తారు.

Similar News

News November 19, 2025

న్యూస్ రౌండప్

image

✦ TGలో నేటి నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. మ.12 గంటలకు HYD నెక్లెస్ రోడ్డులో ఇందిరా గాంధీ విగ్రహం వద్ద చీరల పంపిణీని ప్రారంభించనున్న CM రేవంత్
✦ పార్టీ ఫిరాయింపులపై నేడు, రేపు MLAల విచారణ.. నేడు తెల్లం వెంకట్రావు, సంజయ్, రేపు పోచారం, అరికెపూడి గాంధీకి సంబంధించిన పిటిషన్ల విచారణ
✦ రేపు బిహార్‌కు CM CBN, మంత్రి లోకేశ్.. నితీశ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడంతో పాటు పారిశ్రామికవేత్తలతో భేటీ

News November 19, 2025

మావోయిస్టుల కథ ముగిసినట్టేనా?

image

‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఒక్కొక్కరిగా హతం అవుతున్నారు. 5 నెలల్లో ఐదుగురు సభ్యులు మృతి చెందారు. వారిలో సుధాకర్, బాలకృష్ణ, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అంజు దాదా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న తదితర కీలక సభ్యులు లొంగిపోయారు. పలువురు ప.బెంగాల్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. తాజాగా హిడ్మా మృతితో కేంద్ర నాయకత్వం మరింత బలహీనపడింది.

News November 19, 2025

సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

image

సినీ నటి తులసి యాక్టింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31న షిర్డీకి వెళ్తున్నానని, ఆరోజు నుంచి సినిమాలకు దూరమై మిగిలిన జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేస్తానని ఆమె పేర్కొన్నారు. తులసి 4వ ఏట నుంచి నటనా ప్రస్థానాన్ని మొదలెట్టారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సుమారు 300 సినిమాలు చేశారు. ‘శంకరాభరణం’లో బాలనటిగా మంచి గుర్తింపు పొందారు. యువ హీరోలకు తల్లి పాత్రల్లోనూ కనిపించి మెప్పించారు.