News October 17, 2024
అమెజాన్ ప్రైమ్‌లో యాడ్స్.. వచ్చే ఏడాది అమలు
ఇండియాలోని యూజర్లకు షాకిచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధమైంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు వచ్చే ఏడాది నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో యాడ్స్‌ను జోడించనున్నట్లు ప్రకటించింది. యాడ్ ఫ్రీ కంటెంట్ కోసం మరింత ధర వెచ్చించి సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి రేట్ల వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, US, UK తదితర దేశాల్లోని యూజర్లకు యాడ్స్‌తో కూడిన కంటెంట్‌ను ప్రైమ్ అందిస్తోంది.
Similar News
News November 14, 2024
జగనన్నా క్షమించు.. లోకేశన్నా కాపాడు: శ్రీరెడ్డి
AP: తన వల్ల YCPకి చెడ్డపేరు వచ్చిందని, మాజీ CM జగన్ క్షమించాలని నటి శ్రీరెడ్డి కోరారు. ప్రత్యర్థులపై తాను వాడిన భాషతో పార్టీకి నష్టం జరిగిందని, ఇకపై YCPకి దూరంగా ఉంటానని లేఖ రాశారు. మరోవైపు, తన కుటుంబాన్ని కాపాడాలని మంత్రి లోకేశ్‌ను కోరారు. కూటమి పార్టీలు, నేతలపై జుగుప్సాకరంగా మాట్లాడి తప్పు చేశానని, సారీ చెబుతున్నట్లు రాసుకొచ్చారు. శ్రీరెడ్డిపై రాజమండ్రి, అనకాపల్లి, విజయవాడలో కేసులు నమోదయ్యాయి.
News November 14, 2024
జిన్‌పింగ్‌తో భేటీ కానున్న బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ నెల 16న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. పెరూలో జరుగుతున్న APEC సదస్సులో ఇద్దరు నేతలు విడిగా భేటీ అవుతారని తెలుస్తోంది. బైడెన్ హయాంలో వీరి మధ్య ఈ సమావేశం మూడోది, ఆఖరిది కావడం గమనార్హం. చైనాను వ్యతిరేకించే ట్రంప్ వచ్చే జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.
News November 14, 2024
తిరుమల శ్రీవారి దర్శనానికి 8గంటలు
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 8గంటల సమయం పడుతోంది. 2 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,441 మంది దర్శించుకోగా, 20,639మంది తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.12కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.