News September 22, 2024

HIV వ్యాక్సిన్ తయారీలో పురోగ‌తి.. వారంలో రెండు డోసులు

image

HIV వ్యాక్సిన్ తయారీలో ఎంఐటీ ప‌రిశోధ‌కులు పురోగ‌తి సాధించారు. వైరస్ నియంత్రణ కోసం ఈ టీకాను వారం వ్యవధిలో రెండు డోసులు ఇస్తారు. తొలి డోసును కొద్ది మోతాదులో, రెండో డోసును అధిక మోతాదులో రోగికి వేస్తారు. తద్వారా వైరస్‌ మ్యుటేషన్‌ జరిగేలోగా అవ‌స‌ర‌మైన రోగ‌నిరోధ‌క వ్యవస్థను వ్యాక్సిన్‌ ఉత్తేజితం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు వెల్లడించారు.

Similar News

News October 10, 2024

Q2 ఆదాయంపై ప్రెస్‌మీట్ రద్దు చేసిన TCS

image

రతన్ టాటా కన్నుమూయడంతో తమ ద్వితీయ త్రైమాసిక ఆదాయాన్ని వివరించేందుకు నిర్వహించాల్సిన ప్రెస్‌మీట్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) రద్దు చేసింది. ఈ రోజు సాయంత్రం ఈ సమావేశం జరగాల్సి ఉండగా, అదే సమయానికి రతన్ అంత్యక్రియలు జరగనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. బోర్డు మీటింగ్ అనంతరం తమ జులై-సెప్టెంబరు పద్దును స్టాక్ ఎక్స్ఛేంజీకి వివరిస్తామని పేర్కొన్నాయి.

News October 10, 2024

కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం దావా

image

TG: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరఫు లాయర్ ఉమామహేశ్వరరావు దావా దాఖలు చేశారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్, తుల ఉమను సాక్షులుగా పేర్కొన్నారు. పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. కాగా ఇప్పటికే సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

News October 10, 2024

హరియాణా ఫలితాలపై ECకి కాంగ్రెస్ ఫిర్యాదు

image

హరియాణా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కొన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. మొత్తం 20 సెగ్మెంట్ల ఫలితాలపై అనుమానం ఉందని సంబంధిత ఆధారాలను ఈసీకి సమర్పించామని తెలిపింది. మరో 13 సెగ్మెంట్లకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని పేర్కొంది. ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు తమకు అనుమానాలు ఉన్నట్లు తెలిపింది.