News June 23, 2024
మహిళా పోలీసుతో ఎఫైర్.. DSP నుంచి కానిస్టేబుల్‌గా డిమోషన్

పోలీసు శాఖలో అతను కానిస్టేబుల్ నుంచి DSP స్థాయికి ఎదిగాడు. కానీ అతని వక్రబుద్ధి ఎక్కడి నుంచి వచ్చాడో మళ్లీ అక్కడికే వెళ్లేలా చేసింది. UPకి చెందిన అధికారి కృపా శంకర్ మూడేళ్ల క్రితం ఓ మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని దొరికిపోయాడు. అతని భార్య ఫిర్యాదుతో దర్యాప్తు చేయగా ఇద్దరూ హోటల్లో పట్టుబడ్డారు. దీనిపై ఇటీవల విచారణను పూర్తి చేసిన డిపార్ట్మెంట్.. అతణ్ని కానిస్టేబుల్‌గా డిమోట్ చేసింది.
Similar News
News November 16, 2025
టీమ్ ఇండియా చెత్త రికార్డు

SAతో తొలి టెస్టులో టీమ్ ఇండియా చెత్త రికార్డు నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో IND ఛేదించలేకపోయిన రెండో అత్యల్ప స్కోర్ (124) ఇదే. 1997లో బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచులో వెస్టిండీస్‌పై 120 పరుగులను ఛేజ్ చేయలేకపోయింది. ఇప్పుడు దాదాపు 28 ఏళ్ల తర్వాత రెండో లోయెస్ట్ టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమైంది. అటు టెస్టుల్లో SA డిఫెండ్ చేసుకున్న రెండో అత్యల్ప టార్గెట్ ఇదే కావడం గమనార్హం.
News November 16, 2025
అల్లూరి జిల్లాలో బిర్సా ముండా విగ్రహావిష్కరణ.. పాల్గొన్న ఒడిశా CM

AP: ఒడిశా సీఎం మోహన్ చరణ్ ఇవాళ అల్లూరి జిల్లాలో పర్యటించారు. గిరిజనుల ఆరాధ్య దైవం బిర్సాముండా 150వ జయంతిని పురస్కరించుకుని లగిశపల్లిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మోహన్ చరణ్‌కు రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, సంధ్యారాణి, BJP రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ స్వాగతం పలికారు. స్థానిక గిరిజనులతో కలిసి ఆయన సంప్రదాయ నృత్యం చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో బిర్సా ముండా వీరత్వాన్ని కొనియాడారు.
News November 16, 2025
దిష్టిలో ఉన్న శాస్త్రీయత ఏమిటి..?

చిన్నపిల్లలు ఆహారం సరిగా తీనకపోయినా, విరేచనాలైనా దిష్టి తగిలిందని పెద్దలు అంటుంటారు. దిష్టి తీశాక పిల్లలు చలాకీగా ఆడుకుంటారు. దీని వెనకున్న సైన్స్ ఏంటంటే.. మన కళ్లకు సౌమ్యదృష్టి, క్రూర దృష్టి అనేవి ఉంటాయి. ఈ చూపుల ప్రభావంతో శరీరం నలతకు గురవుతుంది. ఉప్పు, మిరపకాయతో దిగదీయుట, వాటిని నిప్పులో వేయుట వలన వచ్చే పొగ ముక్కు ద్వారా పీల్చుకోవడం వలన నలత దూరమై, శరీరాన్ని తేలిక చేస్తుంది. <<-se>>#Scienceinbelief<<>>


