News June 23, 2024

మహిళా పోలీసుతో ఎఫైర్.. DSP నుంచి కానిస్టేబుల్‌గా డిమోషన్

image

పోలీసు శాఖలో అతను కానిస్టేబుల్ నుంచి DSP స్థాయికి ఎదిగాడు. కానీ అతని వక్రబుద్ధి ఎక్కడి నుంచి వచ్చాడో మళ్లీ అక్కడికే వెళ్లేలా చేసింది. UPకి చెందిన అధికారి కృపా శంకర్ మూడేళ్ల క్రితం ఓ మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని దొరికిపోయాడు. అతని భార్య ఫిర్యాదుతో దర్యాప్తు చేయగా ఇద్దరూ హోటల్‌లో పట్టుబడ్డారు. దీనిపై ఇటీవల విచారణను పూర్తి చేసిన డిపార్ట్‌మెంట్.. అతణ్ని కానిస్టేబుల్‌గా డిమోట్ చేసింది.

Similar News

News November 2, 2024

ఈ యాప్ SBIది కాదు.. నమ్మకండి: PIB

image

నెట్ బ్యాంకింగ్ ద్వారా పొందిన రివార్డు పాయింట్లను రెడీమ్ చేసుకునేందుకు ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని SBI పంపినట్లుగా APK ఫైల్‌తో కూడిన మెసేజ్ చక్కర్లు కొడుతోంది. దీనిని ఇవాళే ఇన్‌స్టాల్ చేస్తే రూ.9,980 పొందొచ్చని మెసేజ్ సారాంశం. అయితే దీనికి SBIకి సంబంధం లేదని PIB ఫ్యాక్ట్‌చెక్ పేర్కొంది. ఇలాంటివి SBI పంపించదని, దీనిని నమ్మి ఇతరులకు షేర్ చేయొద్దని అవగాహన కల్పించింది. మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

News November 2, 2024

బీఆర్ఎస్ జాతకాలు మా దగ్గర ఉన్నాయి: అసదుద్దీన్

image

బీఆర్ఎస్ జాతకాలు తమ దగ్గర ఉన్నాయని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అవి చెబితే ఎవరూ తట్టుకోలేరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. అహంకారంతోనే గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. మేం కాంగ్రెస్‌తో జత కట్టామని ఆ పార్టీ ఆరోపిస్తోంది. కానీ గతంలో మా మద్దతుతోనే మీరు గ్రేటర్ ఎన్నికల్లో గెలిచారు కదా?’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

News November 2, 2024

‘అమరన్’ టీమ్‌ను అభినందించిన సూపర్ స్టార్

image

తమిళ స్టార్ నటుడు శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ‘అమరన్’ సినిమా భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ చిత్రాన్ని వీక్షించి మేకర్స్‌ను అభినందించారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీని చక్కగా చూపించారని మెచ్చుకున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిని నిర్మించినందుకు కమల్ హాసన్‌ను కూడా ఆయన కంగ్రాట్స్ చెప్పారు.