News April 25, 2024

రైల్వే ప్రయాణికులకు అందుబాటు ధరలో భోజనం

image

జనరల్ క్లాస్ ప్రయాణికులకు సరసమైన ధరకే ఆహారం అందించే కార్యక్రమానికి రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. అన్‌రిజర్వ్‌డ్, జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్యాసింజర్లు పరిశుభ్రమైన భోజనం, స్నాక్స్ అందుబాటు ధరల్లో పొందగలరని రైల్వేశాఖ తెలిపింది. ఎకానమీ మీల్ ధర రూ.20, స్నాక్ మీల్ ధర రూ.50 కాగా.. ప్రధాన రైల్వేస్టేషన్లలో ఇవి అందుబాటులోకి వచ్చాయి.

Similar News

News January 24, 2025

Bad News.. అభిషేక్ శర్మకు గాయం!

image

ఇంగ్లండ్‌తో రెండో టీ20 ప్రారంభానికి ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మకు మడమ గాయమైనట్లు క్రిక్ బజ్ పేర్కొంది. దీంతో రెండో టీ20లో ఆయన ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. తొలి టీ20లో అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.

News January 24, 2025

రాజకీయాలు వీడుతున్నారని ప్రచారం.. స్పందించిన కొడాలి నాని

image

AP: ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు దూరం అవుతున్నారని తన పేరుతో వైరల్ అవుతున్న ట్వీట్ ఫేక్ అని మాజీ మంత్రి కొడాలి నాని కొట్టిపారేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు. కాగా వైసీపీకి రాజీనామా చేస్తున్నాడని, గుడివాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా ఓ ట్వీట్ వైరలవుతోంది.

News January 24, 2025

2022లో ట్రంప్ ఉంటే యుద్ధమే ఉండేది కాదు: పుతిన్

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే 2022లో ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమయ్యేదే కాదు. 2020లో ఆయన ఓడిపోవడం వల్ల పరిస్థితి మారింది’ అని వ్యాఖ్యానించారు. కాగా, యుద్ధం ఆపాలని ట్రంప్ నిన్న వ్యాఖ్యానించడంపై రష్యా స్పందించింది. వైట్ హౌస్ నుంచి సిగ్నల్ రాగానే పుతిన్ ట్రంప్‌తో చర్చలు ప్రారంభిస్తారని పేర్కొంది.