News January 31, 2025
క్రికెట్‌కు అఫ్గాన్ ప్లేయర్ గుడ్ బై

అఫ్గానిస్థాన్ లెఫ్టార్మ్ పేసర్ షాపూర్ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా అఫ్గాన్ తరఫున జద్రాన్ 44 వన్డేలు ఆడి 43 వికెట్లు, 36 టీ20లు ఆడి 37 వికెట్లు పడగొట్టారు. 2009లో నెదర్లాండ్స్‌పై తన అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. 37 ఏళ్ల జద్రాన్ 2020లో ఐర్లాండ్‌పై తన చివరి మ్యాచ్ ఆడేశారు.
Similar News
News January 16, 2026
మేడారం జాతర.. 3 రోజులు సెలవులకు డిమాండ్

TG: మేడారం జాతరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. 4 రోజుల పాటు జరిగే ఈ గిరిజన జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని పేర్కొంది. ఈ జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాగా జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో అత్యంత వైభవంగా జాతర జరగనుంది.
News January 16, 2026
ట్రంప్ ఒత్తిడితో మోదీ చాబహార్ పోర్టును వదిలేశారు: కాంగ్రెస్

PM మోదీ మరోసారి ట్రంప్‌కు సరెండర్ అయిపోయారని కాంగ్రెస్ ఆరోపించింది. అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడితో ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై నియంత్రణను వదిలేశారని పేర్కొంది. 120 మిలియన్ డాలర్ల భారత ట్యాక్స్ పేయర్ల డబ్బును మోదీ అందులో ఇన్వెస్ట్ చేశారని, ఇప్పుడది వృథా అయిందని విమర్శించింది. అఫ్గానిస్థాన్, సెంట్రల్ ఏషియాకు వెళ్లేందుకు ఈ పోర్ట్ ఎంతో కీలకమని తెలిపింది. మోదీ దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేసింది.
News January 16, 2026
గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు: రేవంత్

TG: గత ప్రభుత్వం సొంత లాభం మాత్రమే చూసుకుందని సీఎం రేవంత్ విమర్శించారు. ‘కుటుంబం, పార్టీ, రాజకీయ అవసరాలే ప్రాధాన్యంగా గత ప్రభుత్వం పని చేసింది. ప్రాణాలకు తెగించి మరీ యువకులు రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఉద్యోగాలు వస్తాయని ఆశించినా నిరాశే ఎదురైంది. కానీ 2014 నుంచి ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము TGPSCని ప్రక్షాళించి పరీక్షలు నిర్వహిస్తున్నాం’ అని గ్రూప్-3 నియామకపత్రాల పంపిణీలో తెలిపారు.


