News January 31, 2025

క్రికెట్‌కు అఫ్గాన్ ప్లేయర్ గుడ్ బై

image

అఫ్గానిస్థాన్ లెఫ్టార్మ్ పేసర్ షాపూర్ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా అఫ్గాన్ తరఫున జద్రాన్ 44 వన్డేలు ఆడి 43 వికెట్లు, 36 టీ20లు ఆడి 37 వికెట్లు పడగొట్టారు. 2009లో నెదర్లాండ్స్‌పై తన అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. 37 ఏళ్ల జద్రాన్ 2020లో ఐర్లాండ్‌పై తన చివరి మ్యాచ్ ఆడేశారు.

Similar News

News February 19, 2025

తెలుగు రాష్ట్రాలకు నిధులు రిలీజ్ చేసిన కేంద్రం

image

కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు విపత్తు, వరదల సాయం కింద నిధులు విడుదల చేసింది. ఏపీకి అత్యధికంగా రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు రిలీజ్ చేసింది. ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల చేశారు.

News February 19, 2025

సలామ్ DIIs: 45 రోజుల్లోనే రూ.లక్ష కోట్ల పెట్టుబడి

image

స్వదేశీ సంస్థాగత మదుపరులు (DII) భారత స్టాక్ మార్కెట్లకు ఆపద్బాంధవులుగా మారారు. FM నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగానే రిటైల్ ఇన్వెస్టర్లతో కలిసి FIIల పెట్టుబడుల ఉపసంహరణను పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటున్నారు. 2025లో 45 రోజుల్లోనే రూ.1.2లక్షల కోట్లను ఈక్విటీల్లో కుమ్మరించారు. FIIలు వెనక్కి తీసుకున్న రూ.1.6 లక్షల కోట్లతో ఇది దాదాపుగా సమానం. 2024లోనూ DIIలు రూ.5.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం విశేషం.

News February 19, 2025

ఆ సంఘటన తర్వాత మారిపోయా: హీరోయిన్

image

తన జీవితంలో ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నట్లు హీరోయిన్ నభా నటేశ్ తెలిపారు. ప్రమాదం తర్వాత మామూలు స్థితికి వచ్చేందుకు చాలా శ్రమించినట్లు చెప్పారు. ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా కష్టపడినట్లు తెలిపారు. దీని వల్ల వర్కౌట్స్ విషయంలో తన ధోరణి మారిందన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ సరసన ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నారు.

error: Content is protected !!