News November 8, 2024

అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ నబీ రిటైర్మెంట్

image

అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆయనకు చివరి సిరీస్ అని ప్రకటించింది. కాగా 2009లో అఫ్గాన్ ఆడిన తొలి వన్డేలో నబీ సభ్యుడు. ఇప్పటివరకు ఆయన 165 వన్డేలు ఆడారు. 3,549 పరుగులతోపాటు 171 వికెట్లు కూడా పడగొట్టారు. 2019లోనే నబీ టెస్టుల నుంచి తప్పుకున్నారు. ఇకపై ఆయన టీ20ల్లోనే కొనసాగుతారు.

Similar News

News November 8, 2024

రేవంత్‌కు ప్రధాని మోదీ విషెస్

image

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యవంతమైన జీవితం లభించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో ప్రధానికి సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా వెలుగు నింపడానికి నిర్విరామ కృషి చేస్తున్న ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు’ అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ట్వీట్ చేశారు.

News November 8, 2024

అనుచిత ప్రవర్తన.. జోసెఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం

image

కెప్టెన్ హోప్‌పై ఆగ్రహంతో మ్యాచ్ మధ్యలో <<14549882>>గ్రౌండ్ వీడిన<<>> విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు మండిపడింది. అతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. తన ప్రవర్తనపై జోసెఫ్ విచారం వ్యక్తం చేశారు. కెప్టెన్‌కు, విండీస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే నాలుగో ఓవర్‌లో ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌ సరిగా లేదంటూ జోసెఫ్ గ్రౌండ్ నుంచి వెళ్లిపోవడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

News November 8, 2024

DSC ఎంపికలో లోపాలు.. ఏడుగురు తొలగింపు

image

TG: DSC-2024లో ఎంపికైన ఏడుగురు హిందీ పండిట్‌లను ఖమ్మం జిల్లాలో తొలగించడం కలకలం రేపుతోంది. 1:3 నిష్పత్తిలో అర్హత సాధించిన వారిలో కొందరికి అర్హత లేదని ఫిర్యాదు అందగా, వెరిఫికేషన్‌లో క్లీన్‌చిట్ వచ్చింది. 20 రోజులు ఉద్యోగం కూడా చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఎంపిక కాని అభ్యర్థులు కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు చేయగా, డిగ్రీలో ప్రత్యేక సబ్జెక్టుగా హిందీ లేదని విచారణలో బయటపడింది. దీంతో వారిని తొలగించారు.