News September 21, 2024

చరిత్ర సృష్టించిన అఫ్గాన్

image

రెండో వన్డేలో సౌతాఫ్రికాపై 177 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన అఫ్గానిస్థాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో రన్స్ పరంగా ఆ జట్టుకు ఇదే బిగ్గెస్ట్ విన్. గతంలో జింబాబ్వేపై 154, 146, బంగ్లాదేశ్‌పై 142, ఐర్లాండ్‌పై 138 పరుగుల తేడాతో గెలిచింది. ఇక సౌతాఫ్రికాకు ఐదో అతిపెద్ద ఓటమి. గతంలో ఇండియా 243, పాక్ 182, శ్రీలంక 180, 178 రన్స్ తేడాతో ఆ జట్టుపై విజయం సాధించాయి.

Similar News

News October 5, 2024

తెలుగు సినిమా షూటింగ్ నుంచి పారిపోయిన ఏనుగు

image

కేరళలో చిత్రీకరణ జరుపుకొంటున్న ఓ తెలుగు సినిమా సెట్ నుంచి పుత్తుప్పలి సాధు అనే ఏనుగు పారిపోయింది. నిన్న రాత్రి షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెనుకవైపు నుంచి మరో ఏనుగు ఢీ కొట్టడంతో భయపడి సమీపంలోని అడవిలోకి సాధు పరిగెత్తిందని స్థానిక అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం ఏనుగును పట్టుకున్నామని, ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలూ కాలేదని పేర్కొన్నారు.

News October 5, 2024

రుణమాఫీ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుందా?: మోదీ

image

మహారాష్ట్రలో పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ‘రైతులకు రుణమాఫీ చేస్తామనే హామీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టి ఇన్ని రోజులైనా ఎందుకు చేయడం లేదని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర రైతులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మహా వికాస్ అఘాడీ కూటమిని ఓడించాలి’ అని మోదీ పిలుపునిచ్చారు.

News October 5, 2024

ALERT: భారీ నుంచి అతిభారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఏపీ, తెలంగాణపై ఉండనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 4 రోజుల పాటు ఏపీలోని రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని వెల్లడించింది. అటు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కాగా ఇప్పటికే ఇవాళ AP, TGలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.