News May 24, 2024
T20 WC బ్రాండ్ అంబాసిడర్‌గా అఫ్రీది

టీ20 వరల్డ్ కప్-2024 బ్రాండ్ అంబాసిడర్‌గా పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహీద్ అఫ్రీదిని నియమిస్తున్నట్లు ICC తెలిపింది. ఇప్పటికే యువరాజ్ సింగ్, క్రిస్ గేల్, ఉసేన్ బోల్ట్‌లను కూడా బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమించిన సంగతి తెలిసిందే. కాగా మరో వారంలో టీ20 WC ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో ఆడనుంది.
Similar News
News November 28, 2025
వనపర్తి: జీపీ ఎన్నికల ఖర్చులు తప్పక చూపాలి: శ్రీనివాసులు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులకు సంబంధించిన లెక్కలను తప్పనిసరిగా సమర్పించాలని వనపర్తి జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాసులు తెలిపారు. గెలుపు ఓటములకు సంబంధం లేకుండా, ఖర్చు వివరాలను 45 రోజుల్లో అందజేయాలన్నారు. లేనిపక్షంలో గెలిచిన అభ్యర్థిని అనర్హుడిగా, ఓడిన అభ్యర్థిని బ్లాక్ లిస్టులో పెడతామని ఆయన హెచ్చరించారు.
News November 28, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రముఖులు వీరే

TG: హైదరాబాద్‌లో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు దేశవిదేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, ఆనంద్ మహీంద్రా, UAE రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ అంతర్జాతీయ, టెక్ కంపెనీల CEOలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లూ రానున్నారు.
News November 28, 2025
సర్పంచ్ పదవి కోసమే పెళ్లి.. చివరకు!

TG: సర్పంచ్ అయ్యేందుకు హుటాహుటిన పెళ్లి చేసుకొని బోల్తా పడిన ఓ వ్యక్తిని నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కరీంనగర్(D) నాగిరెడ్డిపూర్ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో సర్పంచ్ అవ్వడం కోసం ముచ్చె శంకర్ వెంటనే నల్గొండ(D)కు చెందిన మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మొన్న పెళ్లి జరగ్గా ఓటర్‌గా దరఖాస్తు చేయడంలో ఆలస్యం అయింది. ఆలోపే నోటిఫికేషన్ రావడంతో అతనికి నిరాశే మిగిలింది.


