News May 24, 2024

T20 WC బ్రాండ్ అంబాసిడర్‌గా అఫ్రీది

image

టీ20 వరల్డ్ కప్-2024 బ్రాండ్ అంబాసిడర్‌గా పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహీద్ అఫ్రీదిని నియమిస్తున్నట్లు ICC తెలిపింది. ఇప్పటికే యువరాజ్ సింగ్, క్రిస్ గేల్, ఉసేన్ బోల్ట్‌లను కూడా బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమించిన సంగతి తెలిసిందే. కాగా మరో వారంలో టీ20 WC ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో ఆడనుంది.

Similar News

News February 16, 2025

కోళ్లు చనిపోతే ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

TG: ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న వేళ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మం. నేలపట్లలో వెయ్యి బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు కోళ్ల నమూనాలు సేకరించి HYDలోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ల్యాబుకు పంపారు. 3 రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్ రానుందని, అప్పటివరకు కోళ్లు అమ్మవద్దని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడైనా కోళ్లు చనిపోతే 9100797300కు కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది.

News February 16, 2025

కెనడా వీసా నిబంధనలు మరింత కఠినతరం

image

వీసా నిబంధనల్ని కెనడా మరింత కఠినతరం చేసింది. ఇమ్మిగ్రేషన్ అధికారులకు మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. జారీ చేసిన స్టడీ వీసాలు, వర్క్ పర్మిట్‌, తాత్కాలిక నివాస అనుమతులను కూడా ఇకపై వారు రద్దు చేయొచ్చు. గతంలో దరఖాస్తుల తిరస్కరణ అధికారం మాత్రమే వారికి ఉండేది. కాగా.. అంతర్జాతీయ విద్యార్థులు తమ దేశంలో చేయాల్సిన బ్యాంకు డిపాజిట్‌ను ఇప్పటికే కెనడా రెండింతలు చేసింది.

News February 16, 2025

నేటి నుంచి కులగణన రీసర్వే

image

TG: గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన కులసర్వేలో పాల్గొనని వారికి నేటి నుంచి రీసర్వే చేయనున్నారు. ఈ సారి 3.56 లక్షల కుటుంబాల వివరాలను సేకరించనున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 040-21111111కు కాల్ చేయడం, ప్రజాపాలనా సేవా కేంద్రాల్లో వివరాలు అందించడం, ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. ఈ నెల 28 వరకు సర్వేలో పాల్గొనే అవకాశం కల్పించారు.

error: Content is protected !!